సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌పై నగరంలోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌కు హృతిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్ ద్వారా అన్యాయం జరిగిందని బాధితుడు శశి పోలీసలను ఆశ్రయించారు. హృతిక్ బ్రాండింగ్ చూసి తాము కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌లో డబ్బులు చెల్లించామని ఆయన పేర్కొన్నారు. ఫిట్‌నెస్ సెంటర్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌పై శశి ఫిర్యాదు చేశారు.
కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్‌లో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ నిర్వాహకులు స్లాట్స్ ఇవ్వడం లేదని శశి ఆరోపించారు. ఫిట్‌నెస్ ప్యాకేజీ కింద రూ. 17,490 నుంచి రూ. 36,400 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. స్లాట్స్ ఇవ్వడం లేదని ప్రశ్నించిన వారిని కల్ట్ వెబ్‌సైట్‌లో బ్లాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కల్ట్ ఫిటినెస్ సెంటర్‌పై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు శశి వెల్లడించారు. దేశవ్యాప్తంగా కల్ట్ ఫిట్‌నెస్ సెంటర్లను నిర్వహిస్తుందన్నారు. ఒక్కొక్క బ్రాంచ్‌లో 500 మందికి జిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని.. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం 1800 మంది వరకు స్లాట్స్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది బుకింగ్ తీసుకోవడంతో అందరికి స్లాట్స్ ఇవ్వడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment