
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి కళామందిర్ రోడ్డులోని ఓ గదిలో గుర్తుతెలియని వ్యక్తిని దుండగలు దారుణంగా హత్య చేశారు. దాదాపు 25 ఏళ్ల వయస్సున్న అతన్ని సెంట్రింగ్ కోసం ఉపయోగించే కట్టెలతో తలపై కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. మృతదేహాం ఉన్న గది నుంచి రక్తం బయటకు వచ్చింది. నిర్మాణనుష్య ప్రదేశంలో ఉన్న ఆ గదిలో ఈ విధంగా దారుణ హత్య జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందకుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment