
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: వివాహం చేసుకున్న భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను బుధవారం భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితక బాదిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్గేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాష్‌కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణితో వివాహం జరిగింది. వివాహం సమయంలో వరకట్నంగా రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాష్ బంజారాహిల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేస్తున్నాడు.
చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు
ప్రకాష్ పెళ్ళైన నెలకే భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. హైదరాబాదులో కాపురం పెట్టాక భార్యను అకారణంగా హింసించే వాడు. రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఉండేవాడని బాధితురాలు త్రివేణి తెలిపింది. తనతో అంతరంగికంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని.. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొంది. కాగా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుసుకుంది. బుధవారం రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాష్, మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్‌ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు.
చదవండి: విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..
∙
Comments
Please login to add a commentAdd a comment