కేపీహెచ్‌బీలో అగ్ని ప్రమాదం | Fire Accident In Ramdev Electrical And Hardware Shop At KPHB Colony | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీలో అగ్ని ప్రమాదం

Published Sun, Nov 15 2020 7:44 AM | Last Updated on Sun, Nov 15 2020 11:05 AM

Fire Accident In Ramdev Electrical And Hardware Shop At KPHB Colony - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాందేవ్ ఎలక్ట్రికల్ హార్ట్‌వేర్ షాపులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షాపులోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయింది. అయితే ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement