టెస్ట్ డ్రైవ్ పేరుతో మోసం..అరెస్ట్ | fraud test drive team arrested in kphb colony | Sakshi
Sakshi News home page

టెస్ట్ డ్రైవ్ పేరుతో మోసం..అరెస్ట్

Published Thu, Dec 1 2016 7:11 PM | Last Updated on Mon, Jul 29 2019 6:54 PM

టెస్ట్ డ్రైవ్ పేరుతో మోసం..అరెస్ట్ - Sakshi

టెస్ట్ డ్రైవ్ పేరుతో మోసం..అరెస్ట్

హైదరాబాద్ : టెస్ట్ డ్రైవ్ పేరుతో కార్లను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో టెస్ట్ డ్రైవ్ చేస్తామని వచ్చిన ముగ్గురు సభ్యులు కారుతో ఉడాయించారు.

ఓఎల్‌ఎక్స్‌లో సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు టెస్ట్ చేస్తామని చెప్పి కారుతో చెక్కేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు సభ్యుల ముఠాను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement