భళా.. పోలీస్‌! | Robbed Bag Recovery in One Hour KPHB Police Station | Sakshi
Sakshi News home page

భళా.. పోలీస్‌!

Published Sat, Aug 8 2020 8:33 AM | Last Updated on Sat, Aug 8 2020 8:33 AM

Robbed Bag Recovery in One Hour KPHB Police Station - Sakshi

కేపీహెచ్‌బీకాలనీ: ఓ మహిళ పోగొట్టుకున్న బ్యాగును గంట వ్యవధిలోనే బాధితురాలికి అప్పగించిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... శంషీగూడ ప్రాంతంలో నివాసం ఉండే శ్రీలక్ష్మి శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తన హ్యాండ్‌బ్యాగ్‌తో ద్విచక్ర వాహనంపై కొండాపూర్‌ నుంచి హెచ్‌ఎంటీ హిల్స్‌ మీదుగా శంషీగూడ తన నివాసానికి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత చూసుకోగా తన హ్యాండ్‌ బ్యాగ్‌ కనిపించకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టగా అడ్డగుట్ట సొసైటీ ప్రాంతంలో నివాసం ఉండే వాచ్‌మెన్‌ ఇరగవరపు సాగర్‌కు బ్యాగ్‌ దొరికినట్లు తెలుసుకొని అతడి నుంచి బ్యాగును శ్రీలక్ష్మికి అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement