Madhapur SOT Police Raids On KPHB Club Masti Pub, Details Inside - Sakshi
Sakshi News home page

Raids On KPHB Pub: పబ్‌లో యువతుల అర్ధనగ్న నృత్యాలు

Published Sat, Jun 4 2022 7:09 AM | Last Updated on Sat, Jun 4 2022 2:32 PM

SOT Police Raids On KPHB Club Masti Pub - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పబ్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. దీంతో పబ్‌ నిర్వాహకులు ఇష్టారీతిలో రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ పబ్స్‌ నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ‘సాక్షి’ నిఘాతో కబ్ల్‌ మస్తీ పబ్‌ చీకటి గుట్టు బయటలకు వచ్చింది. మరో పబ్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలో మంజీరా మెజిస్టిక్‌ కమర్షియల్‌లోని క్లబ్‌ మస్తీ పబ్‌లో మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో యువతులతో అర్ధనగ్న నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా పబ్‌ యజమాన్యం పరిమితికి మించి డీజే సౌండ్‌తో పబ్‌ నడుపుతోంది. ఈ పోలీసుల దాడుల్లో భాగంగా పబ్‌లో 9 మంది యువతులు, మేనేజర్‌ ప్రదీప్‌, డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, పబ్‌ యజమాని శివప్రసాద్‌, మేనేజర్లు, కృష్ణ పరారీలో ఉన్నారు. ఇక, డీజే మిక్సర్‌, హుక్కా ప్లేయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనంతరం ఎస్‌ఓటీ పోలీసులు నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. అయితే, కస్టమర్లను ఆకర్షించేందుకే పబ్‌ యాజమాన్యం అమ్మాయిలతో ఇలా అర్ధనగ్న నృత్యాలు చేపిస్తున్నట్టు సమాచారం. 

ఇది కూడా చదవండి: ఆమ్నేషియా పబ్‌ కేసు.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌ వద్ద ఉద్రిక్తత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement