హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న యువతీ యువకులు పోలీస్ స్టేషన్లో హల్ చల్ చేశారు. ఈ ఘటన నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తాగి గొడవ చేస్తున్నారనే కారణంగా వారిని కెపిహెచ్బి పోలీస్ స్టేసన్కు తరలించగా.. అక్కడ వారు వీరంగం సృష్టించారు. తమను అకారణంగా తీసుకొచ్చారంటూ పోలీసులపై దాడికి దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.