
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు.
అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’
మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్‌స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment