Motorist
-
సిగ్నల్ నీడలో
బతుకు గడవాలంటే రోడ్డు మీదకు రాక తప్పదు. వస్తే భయంకరమైన ఎండ. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన బాధ. అందుకే పాండిచ్చేరి ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్‌షేడ్ ఏర్పాటు చేసింది. వీటిని ఒక స్కూటరిస్ట్ ‘ఎక్స్’లో షేర్ చేశాడు. వైరల్ అయిన ఈ పందిళ్లను చూసి చాలా మంది తమ నగరాల్లో కూడా ఇలా జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.మన దేశంలో ఎండలు విపరీతమవడం గతంలో కూడా ఉంది. సాధారణంగా మైదాన్ర΄ాంతాల్లో 40 డిగ్రీల సెల్సియెస్, కొండ ్ర΄ాంతాల్లో 30 డిగ్రీల సెల్సియెస్ దాటితే వడగాడ్పు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. 2016లో జో«ద్‌పూర్‌లో 51 డిగ్రీల రికార్డు టెంపరేచర్ నమోదైంది. 2019లో లాంగెస్ట్ హీట్‌వేవ్‌ను దేశం చూసింది. 32 రోజుల ΄ాటు సాగిన వడగాడ్పులకు ఆంధ్రప్రదేశ్ అల్లాడి΄ోయింది విదర్భ, రాజస్థాన్ కాకుండా. అందుకే మన దేశంలో మే నెలను చూసి జనం గడగడ వొణుకుతారు. బయటికొస్తే వాహనదారులకు నిలువ నీడ ఉండదు. ఇలాంటి సమయంలో పాండిచ్చేరిలో ప్రభుత్వం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్షేడ్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల ఎండలో తిరిగే వారికి నీడ కింద ఉపశమనం దొరికినట్టవుతుంది... దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ను పాటించినట్టవుతుంది. ఒక వాహనదారుడు ఇన్‌స్టాలో రిలీజ్ చేసిన పాండిచ్చేరి గ్రీన్షేడ్స్ను చూసి ప్రతి ఒక్కరూ మా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుండు అంటున్నారు. ప్రభుత్వాలు వింటే బాగుండు. -
వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్ సీఐ
-
ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు. -
చలాన్లు కట్టలేక కారును నుజ్జునుజ్జు చేశాడు!
చలాన్లు కట్టనందుకు మన కారును అధికారులు సీజ్ చేసి.. వేలం వేస్తారంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. లండన్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇలా బాధనే కాదు.. ఈ విషయంలో తట్టుకోలేనంత కోపం కూడా వచ్చింది. రోడ్డు ట్యాక్స్ కట్టకపోవడంతో తన కారును స్వాధీనం చేసుకుంటామని అధికారులు ఇచ్చిన నోటీసులతో అతను చిందులు తొక్కాడు. వెంటనే సొంత కారుపై తన ప్రతాపాన్ని చూపాడు. టైర్లు బద్దలుకొట్టాడు. సీట్లు చింపి పారేశాడు. గేరు రాడ్ విరుగగొట్టాడు. కారు స్టీరింగ్ విరగ్గొట్టాడినికి కూడా అతను ప్రయత్నించాడు. కానీ అతనితో కాలేదు. దీంతో కారు వైపర్లు, హారన్లు పీకిపారేసి.. ఆ తర్వాత ఏకంగా ఓ పెద్ద గొడ్డలిని తీసుకొని కారు ఇంజిన్‌ను ధ్వంసం చేశాడు. అతడు ఇలా ఆగ్రహంతో ఊగిపోతుంటే అతని స్నేహితురాలు మాత్రం తాపీగా నవ్వుకుంటూ ఈ ఘటనను వీడియో తీసింది. ఎందుకంత కోపం నీకు అని పేర్కొన్న ఆమె.. అతని వీరంగాన్ని మాత్రం ఆపలేదు. 'ఈ చెత్త కారు కోసం నేను పన్ను కట్టాలంట.. ఇప్పుడేం చేసుకుంటారో చేసుకోండి. దీనిని పూర్తిగా ఫినిష్ చేసి పారేసా' అంటూ అతడు చివర్లో కోపంగా అన్నాడు. ఇడియట్ యూకే డ్రైవర్స్ వెబ్సైట్లో లీక్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.23 లక్షలమంది చూశారు. తన కారుపై పిచ్చి కోపాన్ని ప్రదర్శించిన డ్రైవర్ పై నేటిజన్లు తమాషా జోకులు వేస్తున్నారు. కారును ఎంత ధ్వంసం చేసినా అతను చలాన్ కట్టకతప్పదని, ఈ వీడియో వల్ల రెట్టింపు జరిమానా పడే అవకాశముందని వారు ఎద్దేవా చేస్తున్నారు. అతన్ని ఆపేందుకు మాత్రం ప్రయత్నించలేదు.