చలాన్లు కట్టలేక కారును నుజ్జునుజ్జు చేశాడు! | Motorist reacts to being clamped over unpaid road tax by TRASHING his car | Sakshi
Sakshi News home page

చలాన్లు కట్టలేక కారును నుజ్జునుజ్జు చేశాడు!

Published Mon, Feb 8 2016 6:41 PM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

చలాన్లు కట్టలేక కారును నుజ్జునుజ్జు చేశాడు! - Sakshi

చలాన్లు కట్టలేక కారును నుజ్జునుజ్జు చేశాడు!

చలాన్లు కట్టనందుకు మన కారును అధికారులు సీజ్‌ చేసి.. వేలం వేస్తారంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. లండన్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇలా బాధనే కాదు.. ఈ విషయంలో తట్టుకోలేనంత కోపం కూడా వచ్చింది. రోడ్డు ట్యాక్స్ కట్టకపోవడంతో తన కారును స్వాధీనం చేసుకుంటామని అధికారులు ఇచ్చిన నోటీసులతో అతను చిందులు తొక్కాడు. వెంటనే సొంత కారుపై తన ప్రతాపాన్ని చూపాడు. టైర్లు బద్దలుకొట్టాడు. సీట్లు చింపి పారేశాడు. గేరు రాడ్‌ విరుగగొట్టాడు. కారు స్టీరింగ్ విరగ్గొట్టాడినికి కూడా అతను ప్రయత్నించాడు. కానీ అతనితో కాలేదు. దీంతో కారు వైపర్లు, హారన్లు పీకిపారేసి.. ఆ తర్వాత ఏకంగా ఓ పెద్ద గొడ్డలిని తీసుకొని కారు ఇంజిన్‌ను ధ్వంసం చేశాడు.

అతడు ఇలా ఆగ్రహంతో ఊగిపోతుంటే అతని స్నేహితురాలు మాత్రం తాపీగా నవ్వుకుంటూ ఈ ఘటనను వీడియో తీసింది. ఎందుకంత కోపం నీకు అని పేర్కొన్న ఆమె.. అతని వీరంగాన్ని మాత్రం ఆపలేదు. 'ఈ చెత్త కారు కోసం నేను పన్ను కట్టాలంట.. ఇప్పుడేం చేసుకుంటారో చేసుకోండి. దీనిని పూర్తిగా ఫినిష్ చేసి పారేసా' అంటూ అతడు చివర్లో కోపంగా అన్నాడు. ఇడియట్ యూకే డ్రైవర్స్ వెబ్‌సైట్‌లో లీక్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.23 లక్షలమంది చూశారు. తన కారుపై పిచ్చి కోపాన్ని ప్రదర్శించిన డ్రైవర్ పై నేటిజన్లు తమాషా జోకులు వేస్తున్నారు. కారును ఎంత ధ్వంసం చేసినా అతను చలాన్‌ కట్టకతప్పదని, ఈ వీడియో వల్ల రెట్టింపు జరిమానా పడే అవకాశముందని వారు ఎద్దేవా చేస్తున్నారు. అతన్ని ఆపేందుకు మాత్రం ప్రయత్నించలేదు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement