
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ ఆసుపత్రిలో మరణించింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ దగ్గర రోడ్డుపై చనిపోయిన గేదెపైకి టాటా ఏస్ వాహనం ఎక్కింది. దీంతో అదుపుతప్పి వాహనం.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది.
టాటా ఏస్ వాహనంలో 16 మంది ప్రయాణికులు వున్నారు. అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు పోట్లపాటి శివమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, వెనకటేశ్వరరెడ్డి, కోటమ్మ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మహిళా ఎస్‌ఐ ఆత్మహత్య
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment