balajinagar
-
Leopard: చిరుతంటే బెరుకేల!?
సాక్షి, అమరావతి : చిరుతను చూసి మనం భయపడతాం గానీ.. అసలు అంతకన్నా ముందే దానికి మనుషులంటేనే చచ్చేంత భయం. మనుషులపై దాడి చేసే సాహసం చేయదు. మనుషుల్ని చూడగానే చిరుతలు భయంతో దూరంగా పారిపోతాయి. కానీ మనమేమో అది మన మీద దాడి చేస్తుందేమోనని బెంబేలెత్తిపోతాం. ‘జనావాసంలోకి చిరుత పులి..’ అంటూ తరచూ వార్తలు చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి జనం చిరుత పులిని చూసి రాళ్లతో తరిమికొట్టిన ఘటనలూ రాష్ట్రంలో చూశాం. నాలుగు రోజుల కిందట తిరుపతి బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లో ఉన్న కుక్కపై చిరుత దాడి చేసింది. అసలు చిరుతల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదమూ లేదని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అనుకోని రీతిలో దాన్ని చుట్టుముట్టినప్పుడు భయంతో మీదపడటం తప్ప, అది జనంపై దాడి చేసి గాయపర్చిన సందర్భాల్లేవంటున్నారు. ఆహారం, నీరు దొరక్క.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమకు తెలియకుండానే అవి జనారణ్యంలోకి వచ్చేస్తాయి. అడవులు, గడ్డి భూములే చిరుతల నివాస ప్రాంతాలు. పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి గడ్డి భూములు, డంపింగ్ యార్డుల వంటిచోటా అవి జీవిస్తాయి. సరిపడా ఆహారం, నీరు ఉన్నంతకాలం అవి తమ పరిధిలోని ఆవాస ప్రాంతంలోనే సంచరిస్తాయి. ఆ రెండు లేనప్పుడు వాటిని వెతుక్కుంటూ బయటకొస్తాయి. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో వాటి ఆవాస ప్రాంతాలు కుచించుకుపోవడం, నీటి చలమలు తగ్గిపోవడంతో వాటి మనుగడకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అవి ఆహారాన్వేషణలో అనుకోకుండా సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. చిరుతలకు కుక్కలంటే మహాప్రీతి. వాటికోసం అప్పుడప్పుడు జనాలు ఉన్న చోటుకు వచ్చి వాటిని వేటాడతాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 మధ్య చిరుతలు చురుగ్గా ఉంటాయి. అప్పుడే ఇతర జంతువులను వేటాడతాయి. మనుషులకు ఎలాంటి ప్రమాదమూ లేదు.. చిరుత పులులు అన్ని ప్రాంతాల్లోనూ మనుగడ సాగించగలవు. కుక్కలు ఇతర చిన్న జంతువులున్నచోట కూడా అవి బతికేస్తాయి. వాటివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 99 శాతం అవి మనుషులకు కనపడకుండానే తిరుగుతాయి. రాష్ట్రంలో చిరుతల వల్ల మనుషులు గాయపడినట్టు ఎక్కడా రికార్డవలేదు. రాష్ట్రంలో వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. – రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణుల విభాగం, ఏపీ) Cheetahs: చీతా గురించి మీకు ఈ విషయాలు తెలుసా! -
కూకట్‌పల్లిలో దారుణం
భాగ్యనగర్‌కాలనీ: వివాహేతర సంబంధం కారణంగా మహిళ దారుణ హత్యకు గురైన సంఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న ఆమె ప్రియుడు శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కూకట్పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్బి రోడ్డునెంబర్ 2లో అంజిరెడ్డి, ప్రత్యూష రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. అంజిరెడ్డి వ్యాపారం నిమిత్తం గత ఏడాది శ్రీలంక వెళ్లాడు. ఈ సమయంలో ప్రత్యూష తన స్నేహితుడు శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న అంజిరెడ్డి.. శ్రీనివాస్‌ను ఇంటికి రానివ్వకపోవటమే కాకుండా గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే శ్రీనివాస్ మూడునెలల క్రితం బాలాజీనగర్‌లోని ఓ అపార్టుమెంట్లో పెంట్ హౌస్‌లో అద్దెకు దిగాడు. ఇటీవల అంజి రెడ్డి శ్రీలంక వెళ్లడంతో శ్రీనివాస్, ప్రత్యూషను తన ఇంటికి తీసుకువచ్చి ఇంటి యజమానికి భార్యగా పరిచయం చేశాడు. ఇటీవల ప్రత్యూష పుట్టింటికి వెళ్లి కూతురిని అక్కడే వదిలేసి గత శుక్రవారం బాలాజీనగర్‌లోని శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఇదిలా వుండగా శనివారం రాత్రి ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన శ్రీనివాస్ తిరిగిరాకపోగా, సోమవారం అతని ఫ్లాట్‌లోంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన ఇంటి యజమాని కిటికీలు తెరిచి చూడగా ప్రత్యూష చనిపోయి వుండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కూకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరీరమంతా కత్తి పోట్లు ఉండటం, మృతదేహం పక్కనే కత్తి ఉండటంతో శ్రీనివాసే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడికోసం గాలింపు చేపట్టారు. -
తిరుమలలో కొండ చిలువ కలకలం
తిరుమల : తిరుమలలో మంగళవారం ఓ కొండచిలువ స్థానికులను హడలెత్తించింది. స్థానికులు నివాసముండే బాలాజీనగర్ మొదటి లైన్ వెనుకభాగంలో ఉన్న చెట్ల నుంచి సుమారు ఎనిమిది అడుగల పొడవైన కొండ చిలువ ఓ ఇంట్లోకి చొరబడింది. దాంతో ఆ ఇంట్లోనివారు పరుగులు పెట్టారు. వెంటనే ఈ విషయాన్ని పాములు పట్టే మునిస్వామికి తెలియజేశారు. అక్కడకు చేరిన మునిస్వామి పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. తర్వాత ఆ పామును సురక్షితంగా అవ్వాచారికోన లోయలో వదిలిపెట్టారు. -
హైవే రక్తసిక్తం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం గాయపడి మృత్యువుతో పోరాడుతున్న ఇద్దరు డ్రైవర్లు మృతుల్లో ఒకరిది విజయనగరం, మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది కేబిన్‌లోనే చిక్కుకున్న డ్రైవర్ తగరపువలస, న్యూస్‌లైన్ : జాతీయ రహదారి రక్త సిక్తమైంది. బాలాజీనగర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. మృతులలో ఒకరు విజయనగరానికి చెందిన ఇనపకుర్తి సత్యనారాయణ అలియాస్ చినబాబు (45). మరో ఏభై ఏళ్ల వయసు గల మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా చెన్నాపూర్ నుంచి ఖాళీ బీరు సీసాలతో శ్రీకాకుళం జిల్లా రణస్థలం వెళ్తున్న మినీ లారీకి వెనుక టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ శ్రీను (24) రోడ్డుపక్కన నిలిపి వీల్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. విజయనగరంలోని స్వగ్రామానికి వెళ్లేందుకు సత్యనారాయణ ఇదే వ్యాన్‌లో ప్రయాణిస్తున్నాడు. డ్రైవర్ శ్రీనుకు సహాయం చేసేందుకు అతను కూడా దిగాడు. ద్వారపూడి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఖాళీ మినీ లారీ ఆగి ఉన్న ఆ లారీని బలంగా ఢీకొట్టింది. అప్పుడే రెండు వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటుతున్న ఏభై ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి తల నుజ్జునుజ్జవగా ముందు వాహనం డ్రైవర్ శ్రీను తలపై బలమైన గాయాలయ్యాయి. ఆ పక్కనే ఉన్న సత్యనారాయణకు గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. వెనక లారీలో ఉన్న డ్రైవర్ రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన స్థలానికి నేషనల్ హైవే అంబులెన్స్, 108 సిబ్బంది చేరుకున్నప్పటికీ ఇరుక్కున్న డ్రైవర్‌ను తీయలేక ఫ్లూయిడ్స్ ఇచ్చి కాపాడుకొచ్చారు. అంతలో చుట్టుపక్కల మెకానిక్‌లు వచ్చి గొలుసులు, గునపాలతో కేబిన్ నుంచి నలభై నిమిషాల పాటు శ్రమించి డ్రైవర్‌ను వెలికి తీశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కల్యాణమండపం నిర్వాహకుడు శ్రీను సాహసించి చేతులతో లారీ అద్దాలను పగులగొట్టడంతో ఆయన చేతికి గాయమైంది. తీవ్ర గాయాలతో ఉన్న డ్రైవర్ వివరాలేవీ చెప్పలేకపోవడంతో ఇద్దరు డ్రైవర్లను హైవే అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. ఈ డ్రైవర్ కోమాలో ఉన్నట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో భీమిలి ట్రాఫిక్ పోలీసులు క్రేన్ తీసుకువచ్చి వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లుడికి ద్విచక్రవాహనం కొనడానికి వెళ్లి.. మృతుడు సత్యనారాయణ విజయనగరంలో హొటల్ నిర్వహిస్తుంటాడు. ఈ నెల 2న కుమార్తెకు కత్తిపూడికి చెందిన యువకునితో పెళ్లి జరిపించాడు. అల్లుడికి లాంఛనాలలో భాగంగా అన్నవరంలో ద్విచక్రవాహనం కొనిచ్చేందుకు గత శనివారమే వెళ్లాడు. తిరుగుప్రయాణంలో మృత్యువాత పడటాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
కొండపై ఇళ్లు, అంగళ్లు గోవిందా !
టీటీడీ అధికారులు నిబంధనలకు పదును పెట్టారు. దేవస్థానం చట్టాన్ని అతిక్రమించి క్రయ, విక్రయాలు చేసిన ఇళ్లు, దుకాణాలపై నిబంధనల కొర డా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేశారు. బాలాజీనగర్‌లో ఆధునికీకరించిన ఇళ్లను తొలి నుంచీ టీటీడీ రికార్డులో ఉన్న వారికి మాత్రమే కేటాయించాల ని నిర్ణయించడం ఇందుకు నిదర్శనం. కొనుగోలు చేసిన వారి ని పక్కన పెట్టేశారు. ఇదే విధానాన్ని దుకాణాలకు అమలు చేయాలని నిర్ణయించారు. సాక్షి, తిరుమల: 1980 నుంచి 2003 సంవత్సరం వరకు మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయ, ఇతర ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి బాలాజీనగర్‌లో ప్రత్యామ్నాయంగా 1,060 ఇళ్లు కేటాయించారు. 1,350 దుకాణాలు కేటాయిం చారు. టీటీడీ నిబంధనల మేరకు వాటిని క్రయవిక్రయాలు చేయకూడదు. ఇందుకు భిన్నంగా క్రయ, విక్రయాలు సాగిపోయాయి. దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు వివరా లు సేకరించారు. తొలి నుంచి తమ ఆధీనంలో ఉన్న వారు మాత్రం సంబంధిత రికార్డులు అందజేశారు. కొనుగోలు చేసిన వారు కూడా తమ వద్ద ఉన్న పత్రాలను టీటీడీ విజిలెన్స్ అధికారులకు అందజేశారు. వీటి ఆధారంగా 400 ఇళ్లు, 300 దుకాణాలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు 2000 సంవత్సరానికి ముందు వరకు ఉన్న స్థానిక పరిస్థితులు, ధర్మకర్తల మండలి నిర్ణయాల మేరకు కొనుగోలు చేసిన వారిలో స్థానికులకు మినహాయింపు ఇచ్చి టీటీడీ రికార్డుల్లో పొందుపరిచి రెగ్యులరైజ్ చేశారు. తర్వాత మారిన పరిస్థితుల వల్ల కొనుగోలు చేసినవారి పేర్లు మార్చే విషయంలో టీటీడీ ధర్మకర్తల మండలి కొంత వెనుకడుగు వేసింది. ఇదే విషయం లో 2010లో అప్పటి ధర్మకర్తల మండలి 62వ తీర్మానం ప్రకా రం సొంతదారులు లేని వారసులకుమాత్రమే పేర్లు మార్చేం దుకు ఆమోదం తెలిపింది. కొనుగోలు చేసిన ఇళ్లు, దుకాణా లు పేర్లు మార్చేందుకు నిరాకరిస్తూ తీర్మానించారు. ఇదే ని బంధనను అనుసరించి ప్రస్తుతం బాలాజీనగర్‌లో ఆధునికీకరణ పనులు పూర్తిచేసుకున్న 66 ఇళ్లలో 41మంది అసలు లబ్ధిదారులకు మాత్రమే తిరిగి ఇళ్లను కేటాయించాలని నిర్ణయిం చారు. కొనుగోలు చేసిన, ఇతర కారణాలలో ఉన్న ఇళ్లను కేటాయించే విషయపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఆవేదనలో కొనుగోలుదారులు టీటీడీ అధికారులు నిబంధనల కొరడా ఝుళిపించడంతో దు కాణాలు, ఇళ్లు కొనుగోలు చేసిన వారు హడలిపోతున్నారు. తిరుమలేతర ప్రాంతాల్లో నివాసమున్న వారు ఈ విషయం లో అన్నీ తెలిసి తప్పు చేశామనే అభిప్రాయంలో ఉన్నారు. ఇక తిరుమల రికార్డుల్లో ఉన్న వారు మాత్రం మాస్టర్‌ప్లాన్ బా ధితుల కింద పాత పద్ధతులను అనుసరించి తమ పేర్లు మా ర్చుకునే అవకాశం రాకపోతుందా ? అనే ఆశతో ఉన్నారు. రికార్డులో ఉన్న 41 మంది లబ్ధిదారులకు కేటాయిస్తాం తిరుమల బాలాజీనగర్‌లో ఇళ్ల ఆధునికీకరణ పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘ఇళ్ల కేటాయింపులో జాప్యమెందుకో’ కథనంపై టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వీ.దేవేంద్రరెడ్డి వివరణ ఇచ్చారు. బాలాజీనగర్‌లో 66 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఇం దులో పంచాయతీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న 41 మంది లబ్ధిదారులకు తిరిగి కేటాయిస్తామని చెప్పారు. మిగిలిన వారి విషయంలో దేవస్థానం ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారుల ఉత్తర్వులను అమలు చేస్తామని స్పష్టం చేశా రు. రెండు రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని తెలిపారు.