టీటీడీ అధికారులు నిబంధనలకు పదును పెట్టారు. దేవస్థానం చట్టాన్ని అతిక్రమించి క్రయ, విక్రయాలు చేసిన ఇళ్లు, దుకాణాలపై నిబంధనల కొర డా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేశారు. బాలాజీనగర్‌లో ఆధునికీకరించిన ఇళ్లను తొలి నుంచీ టీటీడీ రికార్డులో ఉన్న వారికి మాత్రమే కేటాయించాల ని నిర్ణయించడం ఇందుకు నిదర్శనం. కొనుగోలు చేసిన వారి ని పక్కన పెట్టేశారు. ఇదే విధానాన్ని దుకాణాలకు అమలు చేయాలని నిర్ణయించారు.
సాక్షి, తిరుమల:
1980 నుంచి 2003 సంవత్సరం వరకు మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయ, ఇతర ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి బాలాజీనగర్‌లో ప్రత్యామ్నాయంగా 1,060 ఇళ్లు కేటాయించారు. 1,350 దుకాణాలు కేటాయిం చారు. టీటీడీ నిబంధనల మేరకు వాటిని క్రయవిక్రయాలు చేయకూడదు. ఇందుకు భిన్నంగా క్రయ, విక్రయాలు సాగిపోయాయి. దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు వివరా లు సేకరించారు. తొలి నుంచి తమ ఆధీనంలో ఉన్న వారు మాత్రం సంబంధిత రికార్డులు అందజేశారు. కొనుగోలు చేసిన వారు కూడా తమ వద్ద ఉన్న పత్రాలను టీటీడీ విజిలెన్స్ అధికారులకు అందజేశారు. వీటి ఆధారంగా 400 ఇళ్లు, 300 దుకాణాలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
2000 సంవత్సరానికి ముందు వరకు ఉన్న స్థానిక పరిస్థితులు, ధర్మకర్తల మండలి నిర్ణయాల మేరకు కొనుగోలు చేసిన వారిలో స్థానికులకు మినహాయింపు ఇచ్చి టీటీడీ రికార్డుల్లో పొందుపరిచి రెగ్యులరైజ్ చేశారు. తర్వాత మారిన పరిస్థితుల వల్ల కొనుగోలు చేసినవారి పేర్లు మార్చే విషయంలో టీటీడీ ధర్మకర్తల మండలి కొంత వెనుకడుగు వేసింది. ఇదే విషయం లో 2010లో అప్పటి ధర్మకర్తల మండలి 62వ తీర్మానం ప్రకా రం సొంతదారులు లేని వారసులకుమాత్రమే పేర్లు మార్చేం దుకు ఆమోదం తెలిపింది. కొనుగోలు చేసిన ఇళ్లు, దుకాణా లు పేర్లు మార్చేందుకు నిరాకరిస్తూ తీర్మానించారు. ఇదే ని బంధనను అనుసరించి ప్రస్తుతం బాలాజీనగర్‌లో ఆధునికీకరణ పనులు పూర్తిచేసుకున్న 66 ఇళ్లలో 41మంది అసలు లబ్ధిదారులకు మాత్రమే తిరిగి ఇళ్లను కేటాయించాలని నిర్ణయిం చారు. కొనుగోలు చేసిన, ఇతర కారణాలలో ఉన్న ఇళ్లను కేటాయించే విషయపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
ఆవేదనలో కొనుగోలుదారులు
టీటీడీ అధికారులు నిబంధనల కొరడా ఝుళిపించడంతో దు కాణాలు, ఇళ్లు కొనుగోలు చేసిన వారు హడలిపోతున్నారు. తిరుమలేతర ప్రాంతాల్లో నివాసమున్న వారు ఈ విషయం లో అన్నీ తెలిసి తప్పు చేశామనే అభిప్రాయంలో ఉన్నారు. ఇక తిరుమల రికార్డుల్లో ఉన్న వారు మాత్రం మాస్టర్‌ప్లాన్ బా ధితుల కింద పాత పద్ధతులను అనుసరించి తమ పేర్లు మా ర్చుకునే అవకాశం రాకపోతుందా ? అనే ఆశతో ఉన్నారు.
రికార్డులో ఉన్న 41 మంది లబ్ధిదారులకు కేటాయిస్తాం
తిరుమల బాలాజీనగర్‌లో ఇళ్ల ఆధునికీకరణ పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘ఇళ్ల కేటాయింపులో జాప్యమెందుకో’ కథనంపై టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వీ.దేవేంద్రరెడ్డి వివరణ ఇచ్చారు. బాలాజీనగర్‌లో 66 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ఇం దులో పంచాయతీ, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న 41 మంది లబ్ధిదారులకు తిరిగి కేటాయిస్తామని చెప్పారు. మిగిలిన వారి విషయంలో దేవస్థానం ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారుల ఉత్తర్వులను అమలు చేస్తామని స్పష్టం చేశా రు. రెండు రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని తెలిపారు.
కొండపై ఇళ్లు, అంగళ్లు గోవిందా !
Published Wed, Nov 6 2013 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement