గుర్‌గావ్‌లో మహిళ మృతి | Woman murdered in Gurgaon, honour killing suspected | Sakshi
Sakshi News home page

గుర్‌గావ్‌లో మహిళ మృతి

Published Sat, Feb 14 2015 10:36 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

Woman murdered in Gurgaon, honour killing suspected

పరువు హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
 గుర్‌గావ్: బోరా కాలన్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంటిలోనే మృతిచెందింది. కాగా, దీనిని పోలీసులు పరువు హత్యగా అనుమానిస్తున్నారు. వివరాలు.. హరియానాలోని భివానీ గ్రామంలో జ్యోతి, ఆమె సోదరి వివాహాలు ఈ నెల 20న చేయడానికి ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు సమీపిస్తోండగా శుక్రవారం ఉదయం జ్యోతి ఇంటిలోనే చనిపోయింది. అనుమానస్పద కారణాలతో ఓ మహిళ మృతి చెందిందని కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేయగా ఆమె తల్లిదండ్రులు మాత్రం జ్యోతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ‘జ్యోతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోలేదని శవపరీక్షలో తేలింది. చనిపోయిన తర్వాత మాత్రమే ఆమెకు ఉరేసినట్లు నివేదికలో వైద్యులు పేర్కొన్నారు’ అని పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఆత్మహత్య కేసును హత్య కేసుగా మారుస్తున్నామని బిలాస్‌పూర్ పోలీస్‌స్టేషన్ అధికారి చెప్పారు. ఆమె కుటుంబసభ్యులు తమనెందుకు పక్కదారి పట్టించాలనుకున్నారో అనే దిశలో విచారణ చేస్తున్నామన్నారు. పరువు హత్య కోణంలో వారిని విచారిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement