నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య
భోపాల్: మధ్యప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ మహిళను అందరు చూస్తూండగానే ఓ అగంతకుడు గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ హత్య మంగళవారం రాత్రి భోపాల్‌లోని అశోకా గార్డెన్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీతా టాకుర్ టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఇటీవలే ఆమె డ్రగ్స్ అమ్మిన కేసులో పట్టుబడి బెయిల్‌పై విడుదలైంది.
మంగళవారం రాత్రి టీకొట్టు మూసిన ఆమె పనివాడితో కలిసి ఇంటికి వెళ్తుండగా 8 గంటల సమయంలో ఓ అంగతకుడు ఆమెను కత్తితో గొంతు కోసి చంపాడు. ఘటనాస్థలి నుంచి పనివాడు తప్పించుకోగా.. అక్కడున్న వారు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. సునీతతో డ్రగ్స్ అమ్మిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పిడంటుడాని, పూర్తి విచారణ చేసి నిందితుని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.