
చంద్ర కళావతి మృతురాలు
సాక్షి, కర్నూలు (టౌన్) : స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త తెలిపిన వివరాలు.. స్థానిక ఎల్కూరు ఎస్టేట్‌లోని రెవెన్యూ కాలనీలో వెంకటేశ్వరరెడ్డి, చంద్రకళావతి (50) దంపతులు ఇల్లు నిర్మించుకుని, ఏడాది కాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా పూనేలో ఉండగా, వెంకటేశ్వరరెడ్డి డోన్ ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయంఅతడు డోన్‌కు బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మరోసారి ప్రయత్నించగా అవుటాఫ్ ఆర్డర్ అని రావడంతో అనుమానంతో ఇంటి సమీపంలోని బంధువు(మరదలు)కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఆమె ఇంటికి వెళ్లి చూడగా చంద్రకళావతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం గమనించి వెంకటేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చింది. అతడు ఇంటికి చేకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు డీఎస్పీ బాబా ఫకృద్దీన్, మూడో పట్టణ సీఐ ఓబులేసు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ రప్పించి పరిసరాలను తనిఖీ చేయించారు. మృతురాలి పుస్తెల గొలుసు, సెల్‌ఫోన్ కనిపించడం లేదని భర్త పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment