ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘ముందు మీ జట్టు సంగతి చూసుకో.. ఆ తర్వాత మా వాళ్ల గురించి మాట్లాడు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. మరోసారి భారత జట్టును తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సొంతగడ్డపై అత్యల్ప స్కోరు
కాగా టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా బెంగళూరు వేదికగా ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో రోహిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా సొంతగడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
పెద్ద గండం నుంచి బయటపడి
నిజానికి.. ఒకానొక దశలో 34 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. కథ తొందరగానే ముగుస్తుందేమోనని అభిమానులు భయపడ్డారు. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం మరోసారి పునరావృతమవుతుందేమోనని బెంబేలెత్తిపోయారు. ఆయితే, రిషభ్ పంత్ (20)కారణంగా టీమిండియా పెద్ద గండం నుంచి బయటపడింది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
టీమిండియా అభిమానుల ముఖాలు అంటూ టీజింగ్..
కాగా ఆస్ట్రేలియా గడ్డపై 2020-21 టెస్టు సిరీస్‌లో భారత జట్టు 36 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా చేసిన స్కోరు.. తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్పం. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఎక్స్ వేదికగా రోహిత్ సేన వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ.. టీమిండియా ఫ్యాన్స్‌ను టీజ్ చేశాడు.
‘కాస్తైనా సిగ్గుండాలి అంటూ కౌంటర్స్
‘‘కనీసం మీ వాళ్లు 36 పరుగుల మార్కు దాటేశారు.. చూడండి.. టీమిండియా అభిమానుల ముఖాలు ఎలా వెలిగిపోతున్నాయో!’’ అంటూ వాన్ హేళన చేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మమ్మల్ని కామెంట్ చేయడానికి కాస్తైనా సిగ్గుండాలి.
2019 తర్వాత టీమిండియాపై ఇంగ్లండ్ సిరీస్ గెలవనే లేదు. టీమిండియా డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఫైనల్ చేరబోతోంది. ఇంగ్లండ్‌కు ఆ అవకాశం లేనే లేదు. అయినా ఐర్లాండ్ చేతిలో మీ జట్టు 52 రన్స్‌కే ఆలౌట్ అయిన విషయం మర్చిపోయావా?’’ అంటూ భారత జట్టు ఫ్యాన్స్ వాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.
కాగా బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయి.. భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్
Look on the bright side Indian fans .. at least you have got past 36 .. 😜😜
— Michael Vaughan (@MichaelVaughan) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment