ఎవరైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారనేది సర్వసాధారణం. ఓ వ్యక్తి తనకు రూ.80 లక్షల జీతం వస్తోందని, ఇప్పుడు బెంగళూరులో రూ.50 లక్షల జీతానికి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు నేను బెంగుళూరుకు రావాలా? వద్దా? అనే సందేహాన్ని రెడ్డిట్‌లో వెల్లడించారు.
నాకు ఐరోపాలో ఐదు సంవత్సరాలు ఉద్యోగానుభవం ఉంది. నా జీతం రూ.80 లక్షల సీటీసీ. నాకు బెంగళూరులో దాదాపు రూ.50 లక్షల సీటీసీ ఆఫర్ వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, జాబ్ మార్కెట్ కూడా బాగుంటుందని ఈ ఆఫర్‌కు అంగీకరించాలనుకుంటున్నాను. దీనికి నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. దీనికి ఓ సలహా ఇవ్వండి? అని రెడ్డిట్‌లో అడిగారు.
ఈ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. భారతదేశంలో పని ఒత్తిడి అధికం, అవినీతి, కల్తీ ఆహారం, కలుషితమైన గాలి, నీరు ఇలా చాలా ఉన్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నారు.
యూరప్‌లో ఉద్యోగంలో స్థిరత్వాన్ని, ముఖ్యంగా తొలగింపులు సందర్బాలను గురించి మరికొందరు వివరించారు. మీకు ఉద్యోగంలో స్థిరత్వం వద్దు, పని భారం ఎక్కువ కావాలనుకుంటే ముందుకు సాగండి అని పేర్కొన్నారు. భారతదేశ జీవన నాణ్యతలో విస్తృత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు హెచ్చరించారు.
ఇదీ చదవండి: చాట్‌జీపీటీ రెజ్యూమ్.. చూడగానే షాకైన సీఈఓ
భారతదేశంలో ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటే, మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే హాయిగా జీవించవచ్చు అని ఇంకొందరు అన్నారు. యూరోప్ నుంచి ఇండియాకు రావాలంటే మీకు నెల రోజుల సెలవు లభిస్తుంది.. కానీ మీరు బెంగుళూరుకు వెళ్లినట్లయితే 15 రోజులు సెలవు లభించడం కూడా కష్టం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment