Ind vs NZ 1st Test Day 1: Toss delayed due to rain: టీమిండియా- న్యూజిలాండ్ తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరులో భారీగా వాన పడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత్‌కు వచ్చింది.
షెడ్యూల్ ప్రకారం... ఇరుజట్ల మధ్య బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, భారత్- కివీస్ తొలి టెస్టుకు వేదికైన చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పటికే మైదానాన్ని కవర్స్‌తో కప్పినా.. సమయానికి మ్యాచ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.
ఫైనల్ దారిలో టీమిండియా
డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ కీలకం. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ సేన కివీస్‌తో మూడు టెస్టుల్లో గెలిస్తే నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. లేదంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల రూపంలో కఠిన సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరోవైపు.. పట్టికలో ఆరోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఇటీవలే శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. అయితే, భారత్‌లో సత్తా చాటి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ 2024 జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ప్లేయర్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, జాకోబ్ డఫీ, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.
A wet start to Day 1 in Bengaluru. Heavy rain around M Chinnaswamy Stadium means the toss will be delayed until further notice 🏏 #INDvNZ pic.twitter.com/eowepdeila
— BLACKCAPS (@BLACKCAPS) October 16, 2024
Comments
Please login to add a commentAdd a comment