
డబ్బులు ఇస్తానని మహిళతో అసభ్యంగా..
మంగళూరు: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు మంగళూరు సిటీ బస్ స్టేషన్ వద్ద ఓ మహిళకు డబ్బులు చూపి.. వస్తావని అడిగాడు. స్థానికంగా ఉద్యోగం చేసే ఆమె అతని ప్రవర్తన పట్ల అభ్యంతరం తెలిపింది. తనపట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిలదీసింది. దీంతో నలుగురు గూమిగుడి అతడిని చితకబాదారు.
అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేసే మహిళగా భావించి తాను అలా అడిగానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.