వివాహితతో సంబంధం.. అడ్డంగా బుక్కైన డీఎస్పీ | Deputy Superintendent Of Police Illicit Affair With Married Woman | Sakshi
Sakshi News home page

వివాహితతో సంబంధం.. డీఎస్పీ రాసలీలలు

Published Mon, Nov 26 2018 8:19 AM | Last Updated on Mon, Nov 26 2018 8:26 AM

Deputy Superintendent Of Police Illicit Affair With Married Woman - Sakshi

డీఎస్పీ అక్కడికీ వస్తూ పోతూ ఉన్నాడు. భార్యకు ఎంత చెప్పినా వినలేదు. ఆదివారం మరోసారి డీఎస్పీ...

తిరుచానూరు: ఆయన ఒక బాధ్యత కలిగిన పోలీసు ఆఫీసర్‌. ప్రజలకు మంచి చేయాల్సిన వృత్తిలో ఉంటూ వివాహితకు మాయమాటలు చెప్పాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ లొంగదీసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిద్దరూ గదిలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తిరుచానూరు సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కలికిరి గ్రామానికి చెందిన రెడ్డిప్రసాద్‌కు వాయల్పాడుకు చెందిన యువతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వృత్తి రీత్యా రెడ్డిప్రసాద్‌ హైదరాబాద్‌లోని ఓ సంస్థలో అసిస్టెంట్‌ ఫార్మసిస్ట్‌గా పనిచేస్తుండడంతో అక్కడే కాపురం పెట్టాడు. అక్కడ వారికి ఒక డీఎస్పీతో పరిచయం ఏర్పడింది. ఆ డీఎస్పీ తరచూ రెడ్డి ప్రసాద్‌ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి రెడ్డిప్రసాద్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రెడ్డి ప్రసాద్‌ హైదరాబాద్‌లోని బూచుపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎస్పీ రౌడీలను పూరమాయించి రెడ్డిప్రసాద్‌పై దాడి చేయించాడు. ఘటన అనంతరం టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతికి డీఎస్పీ చెప్పాడు. ఆరు నెలల కిత్రం భార్య బలవంతం చేయడంతో తిరుచానూరు సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి రెడ్డిప్రసాద్‌ కాపురం మార్చాడు. డీఎస్పీ అక్కడికీ వస్తూ పోతూ ఉన్నాడు. భార్యకు ఎంత చెప్పినా వినలేదు. ఆదివారం మరోసారి డీఎస్పీ ఇంటికి వచ్చి భార్యతో కలిసి ఉండడాన్ని గమనించిన రెడ్డిప్రసాద్‌ తాళాలు వేసి మీడియాతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు.

మీడియా సాక్షిగా తాళాలు తీయడంతో డీఎస్పీ, వివాహితతో సంబంధం బట్టబయలైంది. మీడియా రాకను చూసిన డీఎస్పీ అక్కడి నుంచి మెల్లగా జారుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు స్టేషన్‌కు రావాలని చెప్పగా కారులో వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. వివాహితను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుడు తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. డీఎస్పీ ప్రస్తుతం మంగళగిరిలోని ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement