![Road Accident At Nalgonda, DSP Vehicle Hit Bike - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/18/Police.jpg.webp?itok=4j3J0JHu)
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకొండ డీఎస్‌పీ వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక తీరిగ్గా డీఎస్పీ నాగేశ్వరరావు వాహనం నుంచి దిగారు. బాధితుడిని డిక్కీలో కుక్కి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.
అయితే బాధితుడి విషయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారంటూ డీఎస్పీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అంటూ పలువురు మండిపడుతున్నారు. కనీస మానవత్వ విలువలు కూడా పాటించరా అని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.
చదవండి: రామ.. రామ! స్వయంగా శఠగోపంతో ఆశీర్వచనం తీసుకున్న భద్రాద్రి ఈవో
Comments
Please login to add a commentAdd a comment