lady conistable
-
డీఎస్పీకి కానిస్టేబుల్‌గా డిమోషన్.. ఏం జరిగిందంటే!
లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్‌తో అనైతిక సంబంధం పెట్టుకోవటం ఓ పోలీసు అధికారికి మాయని మచ్చగా మిగిలింది. అదీకాక, డీఎస్పీ స్థాయి నుంచి ఒక్కసారిగా కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మూడేళ్ల తర్వాత పోలీసులు ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. కృపా శంకర్ కన్నౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి కష్టపడి ఎదిగారు. ఆయన 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో తరచూ కుటుంబ సమస్యల పేరుతో సెలవు పెట్టేవారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో తన భర్త ఇంటికి రాకపోవటం, ఫోన్లు సైతం కలువకపోవడంతో ఆందోళనపడిన ఆయన భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ టీంలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆయన మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆధారాలు సేకరించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిఫార్సు చేశారు. దీంతో డీఎస్పీగా ఉన్న ఆయన్ను గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ
జైపూర్: ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో రిసార్ట్‌పై పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పోలీస్ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్‌లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి వివరాలు ఇలా ఉన్నాయి. అజ్మీర్ జిల్లాలోని డీఎస్పీ హీరాలాల్ సైనీ. జైపూర్ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఆయన జూలై 13వ తేదీన ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌కు వెళ్లాడు. రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో ఇద్దరూ ఆడుకుంటున్నారు. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరూ సన్నిహితంగా కలిశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కానిస్టేబుల్ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంది. ఆ వీడియోలో ఇద్దరూ జలకాలాడుతూ మైకంలో మునిగి తేలుతున్నట్లు ఉంది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు. వెంటనే రిసార్ట్‌పై దాడి చేసి ఆ అధికారితో పాటు కానిస్టేబుల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కన్న కొడుకు (6) కళ్లెదుటే ఆ కానిస్టేబుల్‌తో ఆయనతో సన్నిహితంగా మెలగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరినీ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. నాగౌర్ జిల్లాలోని చిట్టావా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ భర్త ఫిర్యాదు చేశాడు. చదవండి: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం -
మానవత్వం చాటుకున్న లేడీ కానిస్టేబుల్
ముంబై: ఖాకీలు అంటే కరుడుగట్టిన కఠినాత్ములే అనుకుంటే పొరపాటు. వారిలో కూడా మానవతావాదులు ఉంటారు. తోటి వారికి కష్టం వచ్చిందంటే చాలు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా సాయం చేయడానికి ముందుకు వస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ కథనం ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది. ఈ దశాబ్దపు మదర్ థెరీసా అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతలా మెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే సదరు మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రెహనా షేక్ ఈ మేరకు ఉదారత చాటారు. ఒక స్కూలుకు చెందిన 50 మంది నిరుపేద పిల్లలను ఆమె దత్తత తీసుకున్నారు. ఆ వివరాలు.. ముంబైలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రెహనా కొద్ది రోజుల క్రితమే ఎస్సై టెస్ట్ పాసయ్యారు. ఆమె భర్త కూడా డిపార్ట్మెంట్లోనే విధులు నిర్వహిస్తున్నాడు. ఇక వారి కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వారందరి బాగోగులు చూడటమే కాక రెహనా ఇప్పుడు ఏకంగా మరో 50 మందిని దత్తత తీసుకోవడం అంటే మామూలు కాదు. ‘‘గతేడాది నా కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటికి వచ్చిన నా స్నేహితురాలు ఒక పాఠశాలకు చెందిన కొన్ని ఫొటోలు నాకు చూపించింది. అక్కడి పిల్లలను చూసిన తరువాత వారికి నా సహాయం అవసరమని నేను గ్రహించాను. వారంతా మారుమూల గ్రామాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసింది. దాంతో ఆ 50 మంది పిల్లలను దత్తత తీసుకున్నాను. 10 వ తరగతి వరకు వారి విద్యా ఖర్చులను నేను భరిస్తాను అని తెలిపాను. ఇక నా కుమార్తె పుట్టిన రోజు, ఈద్ కోసం దాచిన డబ్బును వారికి ఇచ్చాను” అని కానిస్టేబుల్ రెహనా షేక్ వెల్లడించారు. ఇక గతేడాది మహమ్మారి సమయంలో రక్తం, ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్ కావాలంటూ తనను ఆశ్రయించిన వారందరికి తన శక్తి మేరకు సాయం చేశారు రెహనా. బయటి వారికే కాక.. డిపార్ట్మెంట్ వారికి కూడా సాయం చేశారు. ఇక రెహనా చేస్తున్న సేవలను నగర కమిషనర్ హేమంత్ నాగ్రేల్ ప్రశంసించారు. సన్మానం చేసి ప్రశంసా పత్రం ఇచ్చారు. చదవండి: తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు.. -
మహిళా కానిస్టేబుల్‌తో ఎఫైర్.. ఎస్సైపై వేటు!
సాక్షి, నిజామాబాద్ : ఎట్టకేలకు ఇందల్వాయి పోలీసు స్టేషన్ ప్రొబేషనరీ ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం, తద్వార శారీరక, మానసిక వేధింపులతో ఆమె భర్త శివాజీరావు ఆత్మహత్య. ఈ కేసును ఐపీసీ 306 సెక్షన్ కింద నమోదు చేసిన కామారెడ్డి జిల్లా గాంధారి పోలీసులు ఏ1 గా మహిళా కానిస్టేబుల్‌ను, ఏ2 గా ఎస్సై శివప్రసాద్ రెడ్డిని చేర్చారు. గాంధారి మండలం మాదవపల్లిలో రెండు రోజుల క్రితం శివాజీరావు ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వరకు ఆందోళన నిర్వహించారు. గాంధారి–కామారెడ్డి ప్రధాన రహదారిపై రాళ్లు, ముళ్ల కంపలు అడ్డంగా వేసి రాస్తారోఖో చేశారు. కదిలి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైపై చర్యలకు ఉపక్రమించారు. ఎస్సై శివప్రసాద్‌రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ శుక్రవారం సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ సాక్ష్యాలు రుజువైతే 10 సంవత్సరాలు కఠినకారాగార శిక్ష ఉంటుంది. ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన శివప్రసాద్‌రెడ్డి 2019 డిసెంబర్లో ప్రొబేషనరీ ఎస్సైగా ఇందల్వాయిలో నియమితులయ్యారు. అయితే ఈ కాలంలోనే శివప్రసాద్ రెడ్డి విచ్చలవిడిగా వసూళ్ల కార్యక్రమం చేపట్టినట్లు, భూ దందాలు సెటిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: ‘నేను లండన్‌లో ఉంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా’ శారీరక సుఖం కోసం ఆశపడి 1.29 కోట్లు పోగొట్టుకున్నాడు -
పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు
బంజారాహిల్స్: గతంలో పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తనను బెదిరించి పెళ్లి చేసుకుందంటూ అబ్బాయి.. పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని దూరం పెట్టాడంటూ అమ్మాయి.. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తనకంటే ముందే ముగ్గురిని హనీట్రాప్ చేసి పెళ్లిచేసుకుని మోసం చేసిందంటూ అతడు ఆరోపించగా, తన మొదటి పెళ్లి గురించి తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె తేల్చిచెప్పింది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఎం.సంధ్యారాణి(28) ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమెకు గతంలో వివాహం కాగా ఏడేళ్ల కూతురు ఉంది. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో కూతురితో కలిసి ఉంటోంది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన పూసల చరణ్‌తేజ (24) రహ్మత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడితో రెండేళ్ల క్రితం సంధ్యారాణికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారిద్దరూ గతేడాది నవంబర్ 7న కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. తనకు ఏడేళ్ల కూతురు ఉందని, భర్త ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నానంటూ చరణ్‌తేజ్ వద్ద నుంచి బాండ్ పేపర్ రాయించుకుంది. భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడంటూ.. పెళ్లయిన కొన్నిరోజుల తర్వాత నుంచే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో నాలుగు రోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా చరణ్‌తేజ వెళ్లిపోయాడు. ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో తన భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడంటూ సంధ్యారాణి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న చరణ్‌తేజ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. తనను వదిలి వెళ్లవద్దంటూ భార్య సంధ్యారాణి కోరగా తనకు కాపురం ఇష్టం లేదంటూ చెప్పాడు. శంషాబాద్ డీసీపీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు శంషాబాద్: మోసం చేసి పెళ్లి చేసుకున్న తన భార్య హింసిస్తోందని చరణ్‌తేజ శంషాబాద్ డీసీపీకి సోమవారం ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంధ్యారాణి గతంలో రెండు వివాహాలు చేసుకున్న విషయాన్ని దాచిపెట్టి తనను వలలో వేసుకొని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుందని తెలిపాడు. అప్పటి నుంచి తనను వివిధ రకాలుగా వేధిస్తున్నట్లు చెప్పాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. విచారణ చేస్తున్నాం.. మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి ఫిర్యాదు మేరకు చరణ్‌తేజను పిలిపించి విచారణ చేస్తున్నాం. అన్నీ తెలిసే చరణ్‌తేజ తనను పెళ్లి చేసుకున్నాడని, అతడితోనే జీవిస్తానంటూ సంధ్యారాణి చెబుతోంది. వీరిద్దరికి కౌన్సిలింగ్ చేసిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం. – రాజశేఖర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ చదవండి: తెలంగాణలో సెంచరీ కొట్టిన ప్రీమియం పెట్రోల్ ధర -
ఇటు పోలీస్ డ్యూటీ.. అటు పాల డెయిరీ
కరీమాబాద్ : ఎప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి వస్తుందో.. తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియని పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. ఖాళీ సమయంలో పాల డెయిరీ నిర్వహణలో పాలు పంచుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వరంగల్ గాయత్రీనగర్‌కు చెందిన తోటకూర స్వప్న 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వరంగల్‌లోని మహిళా పోలీస్టేషన్లో పనిచేస్తూ విధుల నుంచి వచ్చాక, వెళ్లే ముందు తమ ఇంట్లో పెంచే పదిహేనుకు పైగా పాడిగేదెల ఆలనాపాలనా చూస్తున్నారు. పాలు పితకడం మొదలు అన్ని పనులు చేయడమే కాకుండా పాలను ప్యాకెట్లలో నింపి తన భర్త సురేష్ ద్వారా ఇంటింటికి చేరవేస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు పిల్లల బాగోగులు చూస్తూ ఆదర్శ మాతృమూర్తిగా తోటకూర స్వప్న నిలుస్తున్నారు. చదవండి: ‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’ -
‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’
గాంధీనగర్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడికి ఝలక్ ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన గుజరాత్ మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరో సంచలనానికి తెర తీసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తిరిగి లాఠీతో వస్తానని, ఈసారి ఐపీఎస్‌గా అడుగుపెడతానని ఆమె స్పష్టం చేశారు. నెటిజనులు సునీతా చర్యలను మెచ్చుకుంటూ.. ఆమెని ‘లేడీ సింగం ’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. రాజకీయాలు, పోలీసు అధికారుల విధులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మీడియాలో వచ్చింది కేవలం 10 శాతం మాత్రమేనని.. తన వద్ద ఇంకా 90 శాతం విషయాలు ఉన్నాయని సునీతా యాదవ్ పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించిన అనంతరం అన్ని విషయాలను ప్రజల ముందు పెడతానని సునీత యాదవ్ చెప్పారు. తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘అందరు నన్ను లేడీ సింగం అంటున్నారు. కానీ కాదు.. నేను సాధారణ లోక్ రక్షక్ దళ్ (గుజరాత్ పోలీసు విభాగం) అధికారిణిని. ఖాకీ యూనిఫాంలో అబద్ధం ఉందని ఇంతకుముందు అనుకునేదాన్ని. కానీ, అది ఉద్యోగానికి సంబంధించిన ర్యాంక్‌లో ఉందని ఈ ఘటన నిరూపించింది. అందుకే నేను ఐపీఎస్‌కు ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. సమస్య తేలిగ్గానే పరిష్కారం అయ్యేది. కానీ సరైన ర్యాంక్ లేకపోవడం వల్ల నన్ను ఇప్పుడు బబుల్‌గమ్‌లా నమిలేస్తున్నారు’ అని సునీతా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (లేడీ అండ్ ఆర్డర్) అంతేకాక ‘ఈ యుద్ధంలో నేను మరణించినా నాకు ఎలాంటి విచారం ఉండదు. నా తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుంచి నాకు మద్దతు ఉన్నది’ అని సునీతా యాదవ్ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నానను. ఐపీఎస్‌గా ఎంపికై తిరిగి పోలీసు శాఖలోకి వస్తాను. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఎల్ఎల్బీ చేస్తాను.. లేదా జర్నలిస్ట్‌ను అవుతాను’ అని సునీతా యాదవ్ వెల్లడించారు. మంత్రి అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు. ‘నా పోరాటం సునీతా యాదవ్ కోసం కాదు.. నా పోరాటం ఖాకీ యూనిఫాం కోసం. నాకు ఫోన్లో కొన్ని బెదిరింపులు వచ్చాయి. ‘మీరు దేశం కోసం చాలా చేస్తున్నారు.. ఎక్కువ కాలం జీవిస్తారని అనుకోవడం లేదు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి వారికి తగిన పాఠం చెబుతా’ అని సునీతా యాదవ్ అన్నారు.(‘నా కొడుకు బాధ్యత.. ఉద్యోగం రెండూ ముఖ్యమే’) సమస్యను పరిష్కరించుకుంటే రూ.50 లక్షలు ఇస్తామని తనకు రాయబారం కూడా పంపారని సునీతా యాదవ్ చెప్పారు. మూడు రోజుల కిందటే కాల్ వచ్చిందని తెలిపారు. ఆ ఫోన్ కాల్ గుజరాత్ రాష్ట్రం బయటి నుంచి వచ్చినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సూరత్ పోలీసు కమిషనర్‌ను కలిసి పోలీసు రక్షణ కోరినట్లు ఆమె వెల్లడించారు. -
మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు
సాక్షి, నెల్లూరు : మహిళా కానిస్టేబుల్‌ను వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న ఓ విశ్రాంత ఉద్యోగిపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్‌లో ఓ యువతి నివాసం ఉంటోంది. ఆమె నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రసన్నమాల ఆమె వెంటపడుతూ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. పలుమార్లు సదరు యువతి అతనిని తీవ్రస్థాయిలో మందలించినా మార్పురాలేదు. ఇటీవలే ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. ఈ నెల 2వ తేదీ రాత్రి సదరు మహిళా కానిస్టేబుల్ స్టేషన్లో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమెను వెంబడిస్తూ క్వార్టర్స్ సమీపంలోకి వచ్చేసరికి ఫోన్‌నంబర్ ఇవ్వాలని ఆమెను చేయిపట్టుకునేందుకు యత్నించాడు. దీంతో ఆమె అతని నుంచి తప్పించుకుని వెళుతుండగా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న ఓ ఉద్యోగి ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతరం విశ్రాంత ఉద్యోగిని మందలించి అక్కడి నుంచి పంపివేశాడు. బుధవారం సదరు విశ్రాంత ఉద్యోగి బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లి అక్కడున్న ఉద్యోగులకు సదరు మహిళా కానిస్టేబుల్‌కు డబ్బులు ఇచ్చానని, తనను పెళ్లిచేసుకోమన్నదని ఇలా అనేక రకాల ఆరోపణలు చేశాడు. ఈ విషయంపై పలువురు ఉద్యోగులు మాట్లాడుతుండగా విన్న మహిళా కానిస్టేబుల్ మనస్థాపానికి గురై చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఆరోపణలు చేయడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్న విశ్రాంత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశ్రాంత ఉద్యోగిపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నబజారు ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ తెలిపారు. -
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుత్ను విద్యార్థిని పోలీసులకు అప్పగింత
చెన్నూరు: విద్యార్థినుల పట్ల నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న చెన్నూరుకు చెందిన ఓ యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. తమను నిత్యం బస్సుల్లో ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని కొందరు విద్యార్థినులు కడపలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు గమనించి హెచ్చరించినా మార్పు రాలేదు. రోజూలాగే బస్సులో ఈవ్‌టీజింగ్ చేస్తున్న యువకులను బుధవారం సాయంత్రం కడప నుంచి పల్లెవెలుగు బస్సులో వెళుతున్న ఆ మహిళా కానిస్టేబుల్ గమనించి, చెన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. చెన్నూరు కొత్తరోడ్డు వద్ద కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఎస్ఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నామని, విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. -
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుత్ను విద్యార్థిని పోలీసులకు అప్పగింత
ఈవ్ టీజింగ్‌కు పాల్పడుత్ను విద్యార్థిని పోలీసులకు అప్పగింత student arrested by eve teasing ఆర్టీసీ బస్సు, చెన్నూరు, మహిళా కానిస్టేబుల్ rtc bus, chennur, lady conistable చెన్నూరు: విద్యార్థినుల పట్ల నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న చెన్నూరుకు చెందిన ఓ యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. తమను నిత్యం బస్సుల్లో ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని కొందరు విద్యార్థినులు కడపలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు గమనించి హెచ్చరించినా మార్పు రాలేదు. రోజూలాగే బస్సులో ఈవ్‌టీజింగ్ చేస్తున్న యువకులను బుధవారం సాయంత్రం కడప నుంచి పల్లెవెలుగు బస్సులో వెళుతున్న ఆ మహిళా కానిస్టేబుల్ గమనించి, చెన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. చెన్నూరు కొత్తరోడ్డు వద్ద కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఎస్ఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నామని, విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.