చెన్నూరు: విద్యార్థినుల పట్ల నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న చెన్నూరుకు చెందిన ఓ యువకుడ్ని పోలీసులకు అప్పగించారు. తమను నిత్యం బస్సుల్లో ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని కొందరు విద్యార్థినులు కడపలో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు విన్నవించారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు గమనించి హెచ్చరించినా మార్పు రాలేదు. రోజూలాగే బస్సులో ఈవ్‌టీజింగ్ చేస్తున్న యువకులను బుధవారం సాయంత్రం కడప నుంచి పల్లెవెలుగు బస్సులో వెళుతున్న ఆ మహిళా కానిస్టేబుల్ గమనించి, చెన్నూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్‌ఐ తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. చెన్నూరు కొత్తరోడ్డు వద్ద కొందరు యువకులు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయమై ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, యువకుడ్ని అదుపులోకి తీసుకున్నామని, విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.