కరీమాబాద్ : ఎప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి వస్తుందో.. తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియని పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. ఖాళీ సమయంలో పాల డెయిరీ నిర్వహణలో పాలు పంచుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వరంగల్ గాయత్రీనగర్‌కు చెందిన తోటకూర స్వప్న 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.
ప్రస్తుతం వరంగల్‌లోని మహిళా పోలీస్టేషన్‌లో పనిచేస్తూ విధుల నుంచి వచ్చాక, వెళ్లే ముందు తమ ఇంట్లో పెంచే పదిహేనుకు పైగా పాడిగేదెల ఆలనాపాలనా చూస్తున్నారు. పాలు పితకడం మొదలు అన్ని పనులు చేయడమే కాకుండా పాలను ప్యాకెట్లలో నింపి తన భర్త సురేష్ ద్వారా ఇంటింటికి చేరవేస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు పిల్లల బాగోగులు చూస్తూ ఆదర్శ మాతృమూర్తిగా తోటకూర స్వప్న నిలుస్తున్నారు.
చదవండి: ‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’
Comments
Please login to add a commentAdd a comment