
జైపూర్: ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో రిసార్ట్‌పై పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పోలీస్ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్‌లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి
వివరాలు ఇలా ఉన్నాయి. అజ్మీర్ జిల్లాలోని డీఎస్పీ హీరాలాల్ సైనీ. జైపూర్ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఆయన జూలై 13వ తేదీన ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌కు వెళ్లాడు. రిసార్టులోని స్విమ్మింగ్‌పూల్‌లో ఇద్దరూ ఆడుకుంటున్నారు. అర్ధనగ్నంగా ఉన్న ఇద్దరూ సన్నిహితంగా కలిశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కానిస్టేబుల్ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకుంది. ఆ వీడియోలో ఇద్దరూ జలకాలాడుతూ మైకంలో మునిగి తేలుతున్నట్లు ఉంది. ఆ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు. వెంటనే రిసార్ట్‌పై దాడి చేసి ఆ అధికారితో పాటు కానిస్టేబుల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అయితే కన్న కొడుకు (6) కళ్లెదుటే ఆ కానిస్టేబుల్‌తో ఆయనతో సన్నిహితంగా మెలగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏడీజీ అశోక్ రాథోడ్ దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరినీ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. నాగౌర్ జిల్లాలోని చిట్టావా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ భర్త ఫిర్యాదు చేశాడు.
చదవండి: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం
Comments
Please login to add a commentAdd a comment