సాక్షి, నిజామాబాద్ : ఎట్టకేలకు ఇందల్వాయి పోలీసు స్టేషన్ ప్రొబేషనరీ ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం, తద్వార శారీరక, మానసిక వేధింపులతో ఆమె భర్త శివాజీరావు ఆత్మహత్య. ఈ కేసును ఐపీసీ 306 సెక్షన్ కింద నమోదు చేసిన కామారెడ్డి జిల్లా గాంధారి పోలీసులు ఏ1 గా మహిళా కానిస్టేబుల్‌ను, ఏ2 గా ఎస్సై శివప్రసాద్ రెడ్డిని చేర్చారు. గాంధారి మండలం మాదవపల్లిలో రెండు రోజుల క్రితం శివాజీరావు ఆత్మహత్య చేసుకోగా గ్రామస్తులు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వరకు ఆందోళన నిర్వహించారు. గాంధారి–కామారెడ్డి ప్రధాన రహదారిపై రాళ్లు, ముళ్ల కంపలు అడ్డంగా వేసి రాస్తారోఖో చేశారు. కదిలి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైపై చర్యలకు ఉపక్రమించారు.
ఎస్సై శివప్రసాద్‌రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ శుక్రవారం సీపీ కార్తికేయ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ సాక్ష్యాలు రుజువైతే 10 సంవత్సరాలు కఠినకారాగార శిక్ష ఉంటుంది. ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన శివప్రసాద్‌రెడ్డి 2019 డిసెంబర్‌లో ప్రొబేషనరీ ఎస్సైగా ఇందల్‌వాయిలో నియమితులయ్యారు. అయితే ఈ కాలంలోనే శివప్రసాద్ రెడ్డి విచ్చలవిడిగా వసూళ్ల కార్యక్రమం చేపట్టినట్లు, భూ దందాలు సెటిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చదవండి: ‘నేను లండన్‌లో ఉంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా’
శారీరక సుఖం కోసం ఆశపడి 1.29 కోట్లు పోగొట్టుకున్నాడు
Comments
Please login to add a commentAdd a comment