వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా.. | Man Killed His Wife Due To Extramarital Affair In Hyderabad Vikarabad - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా..

Published Sat, Nov 4 2023 12:05 PM | Last Updated on Sat, Nov 4 2023 12:45 PM

He Killed His Wife Due To Extramarital Affair - Sakshi

సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధారూరు సీఐ రామకృష్ణ, బంట్వారం ఎస్‌ఐ ఆనంద్‌ వెల్లడించారు. బంట్వారం మండలం వెంకటాపూర్‌కు చెందిన ప్రకాశ్‌.. గత నెల 25న తన భార్య జగ్గమ్మతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యామని, బైక్‌ అదుపుతప్పి గుంతలో పడగా జగ్గమ్మ తలకు గాయమై చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. మృతురాలి బంధువులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. తనకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో జగ్గమ్మ తనను నిత్యం వేధించేదని చెప్పాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనే పథకం వేశాడు. ఉద్దేశపూర్వకంగా బైక్‌ను గుంతలో పడేసి జగ్గమ్మ తలపై బండరాయితో మోది హత్యచేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి.. పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు.
ఇవి చదవండి: హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement