వివాహేతర సంబంధాలతో అనర్థాలు | illeagal affairs dangerous | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధాలతో అనర్థాలు

Published Sat, Jul 30 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

illeagal affairs dangerous

విజయనగరం టౌన్‌ : వివాహేతర సంబంధాలతో సంసారంలో చిచ్చు పెట్టుకోవద్దని, జీవిత భాగస్వామితో నిజాయితీగా కాపురం సాగించాలని సైకాలిజిస్టు ఎన్‌వీఎస్‌ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో హౌస్‌ ఆఫీసర్‌ డీఎస్పీ కె. కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం పలు జంటలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. వివాహానంతరం ఏమైనా సమస్యలు వస్తే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకొని ఒకరిపై ఒకరు సదాభిప్రాయాన్ని పెంపొందించుకొని సుఖమయ వైవాహిక జీవితాన్ని సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గంటా హైమావతి, మహిళా సైకాలిజిస్టు హిమబిందు, ఏఎస్సై కృష్ణ, హెచ్‌సీ బీవీ రమణయ్య, మూర్తి సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement