
ఢిల్లీలో అవార్డు అందుకుంటున్న సంపత్
ఖమ్మంఅర్బన్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ సంపత్‌కు ఏఐఐపీసీ అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు . శుక్రవారం ఢిల్లీలోని త్రివేణి కళా సంఘంలో ఐఐపీసీ (ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐఐపీసీ చైర్మన్ ఓపీ శర్మ చేతుల మీదుగా అందించారు.ఫొటోగ్రఫీ పోటీల్లో సంపత్ ఫొటోలను ఎంపిక చేసి అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు.