
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు సంపత్ జె. రామ్(35) సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సహా నటుడు రాజేశ్ ధృవ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సంపత్ శనివారం రాత్రి బెంగళూరు నెలమంగళలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా.. సంపత్ ఇటీవల తగినన్నీ అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామమైన కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా నరసింహరాజపురలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంపత్ 'అగ్నిసాక్షి' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.
అతని మృతిపై మరో నటుడు రాజేశ్ ధృవ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 'నువ్వు ఇంకా చాలా సినిమాలు చేయాలి.. చాలా పోరాటం మిగిలి ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. దయచేసి తిరిగి రండి.' భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment