
సొంత పార్టీపై అలిగిన ఎమ్మెల్యే సంపత్
సొంత పార్టీపై అలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ శనివారం నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు
హైదరాబాద్: సొంత పార్టీపై అలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ శనివారం నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా నల్లకండువాతో అసెంబ్లీకి వచ్చారు. ఇది గుర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చెన్నారెడ్డి సంపత్‌ను బుజ్జగించేందుకు యత్నించారు.
సంపత్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో.. వంశీచంద్‌కు మైక్ ఇవ్వాలని పదే పదే కోరిన జానారెడ్డి నాకు మైక్ ఇవ్వాలని అడకకపోవడం బాధాకరం. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని ఎత్తిచూపినందుకు ప్రభుత్వం కుట్ర చేసింది. అందుకే ఎస్సీ, ఎస్టీ బిల్లుపై మాట్లాడేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. సబ్ కమిటీ సభ్యుడినైన నాకే అవకాశం రాకుండా చేశారు. మా నాయకులు కూడా నా వైపు నిలవలేదు. ఈ రోజు కాంగ్రెస్‌తో కాకుండా ప్రత్యేకంగా కూర్చుంటా.. జోకర్లు, బ్రోకర్ల కోసం రాత్రి 11 గంటల వరకు సభ నడిపారు’ అని ఆరోపించారు.