వీణవంక : మద్యానికి బానిసై వేదిస్తున్న భర్తను భార్య హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన సంపత్, తిరుమల దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సంపత్.. భార్యా పిల్లలను వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేక శనివారం అర్ధరాత్రి సంపత్ను ఇంట్లో బంధించి రోకలి బండతో కొట్టి చంపింది తిరుమల. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భర్తను హతమార్చిన భార్య
Published Sun, Mar 6 2016 11:51 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement