భార్య చేతిలో భర్త హత్య | husbend died in wife hands | Sakshi
Sakshi News home page

భార్య చేతిలో భర్త హత్య

Published Sat, Jul 16 2016 2:40 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

భార్య చేతిలో  భర్త హత్య - Sakshi

భార్య చేతిలో భర్త హత్య

కుటుంబ కలహాలే కారణం..
కందుకూరు మండలం శ్యామగడ్డలో ఘటన

కందుకూరు: మద్యానికి బానిసై భర్త తరచూ కొడుతుండడంతో విసుగు చెందిన భార్య.. అతడిపై తలపై బండరారుుతో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని లేమూరు పరిధిలో గల శ్యామగడ్డలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని లేమూరు గ్రామ పరిధిలోని శ్యామగడ్డకు చెందిన గుల్వి భిక్షపతి (43), సుజాత భార్యాభర్తలు. వీరికి వివాహమై ఇరవై ఏళ్లు కాగా.. ఇద్దరు కుమారులు, ఒక కుమారై ఉన్నారు. పెద్ద కుమారుడు సురేష్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా, కుమారై రాధిక పదో తరగతి, చిన్న కుమారుడు రాజేష్ 8వ తరగతి చదువుతున్నారు. భార్యాభర్తలు ఇరువురు మహేశ్వరం గేట్ సమీపంలోని పారిశ్రామికవాడలోని ప్రియాంక ఆరుుల్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా.. భిక్షపతి మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా భిక్షపతి తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు.

 భర్త తీరుతో విసిగిపోరుున ఆమె.. అతడి తలపై బండరారుుతో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అతడిని అదే గదిలో భర్త మృతదేహాన్ని ఉంచి తాళం వేసి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోరుుంది. ఎస్‌ఐ చెన్నకేశవ్‌రాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హత్య జరిగిన చోటు నుంచి మరో గదిలోకి మృతదేహాన్ని ఒంటరిగా మార్చడం భార్య ఒక్కదానితో అయ్యే అవకాశం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేక ఆమెకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement