టీవీ పగిలిందని భార్యను హతమార్చిన భర్త | husband killed BY wife | Sakshi
Sakshi News home page

టీవీ పగిలిందని భార్యను హతమార్చిన భర్త

Published Thu, Sep 8 2016 3:25 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

టీవీ పగిలిందని భార్యను హతమార్చిన భర్త - Sakshi

టీవీ పగిలిందని భార్యను హతమార్చిన భర్త

పెద్దాపురం : టీవీ పగిలిందన్న కోపంతో భార్యను చితకబాదిన భర్త.. ఆమె మృతికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పాత పెద్దాపురానికి చెందిన ముక్కు సూర్యప్రకాష్‌ కూలీ పనులు చేస్తుంటా డు. మూడేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌కు పని కోసం వలస వెళ్లినప్పుడు అక్కడ సంధ్య(20)ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇక్కడికి కాపురం మార్చారు. ప్రస్తుతం వీరికి రెండేళ్లు, ఏడాది వయసు కలిగిన కుమారులు ఉన్నారు. ఇలాఉండగా కొంతకాలం నుంచి వీరి మధ్య మనస్ఫర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో టీవీ పగిలిపోవడంతో వీరి మధ్య ఘర్షణ జరిగింది. భార్యను భర్త చితకబాదడంతో ఆమె గాయాల పాలైం ది. ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ బుధవారం మరణించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీష్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement