చెన్నై, సాక్షి ప్రతినిధి: అమ్మ క్యాంటీన్లు, అమ్మ వాటర్ బాటిల్, అమ్మ మార్కెట్లు రాష్ర్టంలో నడుస్తుండగా, అమ్మ థియేటర్ కూడా రాబోతోంది. అమ్మ పేరున అధికార దుర్వినియోగం సాగుతోందంటూ అన్నాడీఎంకేపై ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా చెన్నై సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం ఫొటోలు ఎక్కడ ఉన్నా తొలగిం చడమో లేక కప్పిఉంచడమో చేయాలని అదేశించారు. అయితే కొందరు ఆరోపిస్తున్నట్లుగా అమ్మ అనే పదా న్ని తొలగించాల్సిన అవసరం లేదనిన్నారు.
అమ్మ అనేది ప్రతి ఒక్కరూ వాడే పదం, అందులో ఎటువంటి రాజకీయమో, తప్పిదమో లేదని వివరించారు. ఈనెల 5న ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడగా ఆనాటి నుంచి 17వ తేదీ వరకు మొత్తం 54,976 ఫిర్యాదులు అందగా వాటిల్లో 52,258 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలపై 34,254 ఫిర్యాదులు, గోడలపై పార్టీల రాతలపై 20,722 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాహనాల తనిఖీల్లో 10 కోట్ల 25లక్షలా 69 వేల 324 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే *10 లక్షలా 41 వేల విలువైన బంగారు, వెండి నగలు పట్టుబడినట్లు
అమ్మ ఓకే.. బొమ్మ వద్దు
చెప్పారు. తగిన ఆధారాలతో వ్యాపారులు 10లక్షలు, రాజకీయ నాయకులు 50వేలు తీసుకెళ్లవచ్చని అన్నారు. ఆధారాలు చూపినా పట్టుబడిన నగదును ఇచ్చేందుకు నిరాకరించిన అధికారులపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఒక మహిళా అధికారిపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యను తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయాల్లో ఉత్సవాలు చేసుకోవచ్చు, అయితే అక్కడి వేదికలపై రాజకీయ నాయకులు ఆశీనులు కారాదని చెప్పారు. అన్నాడీఎంకే, డీఎంకేలు ఇంటర్నెట్ ద్వారా ప్రచారానికి ఈసీ నుంచి అనుమతి పొందారని తెలిపారు. నోటాకు చిహ్నంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
మంత్రిపై విచారణ
ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని మంత్రి సంపత్‌పై విచారణకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. కడలూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థికి ప్రచారం చేస్తున్న మంత్రి ఎంసీ సంపత్ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా ఒక దినపత్రికలో ఫొటోతో సహా వార్త వచ్చినట్లు డీఎంకే ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టాలని కడలూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. నివేదికను అనుసరించి చర్యలు చేపడతామని తెలిపారు. మంత్రిపై నేరం రుజువైన పక్షంలో ఎఫ్‌ఐఆర్, చార్జిషీటు దాఖలు చేస్తామని వివరించారు.
అమ్మ ఓకే బొమ్మ వద్దు
Published Thu, Mar 20 2014 3:45 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement