ఖమ్మం జిల్లా గుండాల మండలం ఆళ్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసి పరారైన దుండగులను బోడు పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఖమ్మం జిల్లా గుండాల మండలం ఆళ్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసి పరారైన దుండగులను బోడు పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లపల్లి గ్రామానికి చెందిన సంపత్ (29)పై ఆదివారం దుండగులు కత్తులతో దాడి గొంతు కోసి పరారయ్యారు.
దీంతో గుండాల పోలీసులు చుట్టు పక్కల స్టేషన్లలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. పారిపోతున్న ఇద్దరు నిందితులను టేకులపల్లి మండలం బోడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా.. నిందితులు దుమ్ముగూడెం మండలానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.