
వికారాబాద్ అర్బన్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడం గల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. ఎస్సీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన వికారాబాద్‌కు వచ్చారు.
మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో సంపత్ మాట్లాడారు. బూటకపు మాటలతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను 2019లో గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని, ఆయన వస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో చేరేందుకు చాలామంది టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు.