హైదరాబాద్ : నకిలీ ఇన్విజిలేషన్ గుర్తింపు కార్డుతో ఓ అపరిచితుడు పరీక్ష కేంద్రంలోకి దర్జాగా వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆర్‌ఐవో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఓ పెన్‌డ్రైవ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని కంప్యూటర్ ద్వారా చూడగా.. అందులో ఉన్న ఇంటర్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాధానాలను చూసి ఆశ్చర్యపోయారు. ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన వ్యక్తి సుమన్‌గా గుర్తించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులకు చాటుగా సాయం చేద్దామని వచ్చినట్లు విచారణలో తెలిపినట్లు తెలిసింది. ఈ ఘటన శంషాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాలలో శనివారం జరిగింది.
కాగా సెల్‌ఫోన్లతో ఇన్విజిలేటర్లు విధులకు హాజరుకాకూడదని నిబంధనలున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు ఐదుగురు ఇన్విజిలేటర్లు మొబైల్స్ వెంటబెట్టుకుని విధులకు హాజరయ్యారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలోని సాయి గౌతమి కళాశాలలో చోటుచేసుకుంది. పరీక్ష కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్లిన రంగారెడ్డి జిల్లా తూర్పు ఆర్‌ఐఓ హన్మంత్ రెడ్డికి వారు పట్టుబడ్డారు. వెంటనే వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇన్విజిలేషన్ విధుల నుంచి తప్పించారు. సెల్‌ఫోన్లను ఇంటర్ విద్యామండలికి అప్పగిస్తామని ఆర్‌ఐవో చెప్పారు.
నకిలీ ఇన్విజిలేటర్ హల్‌చల్
Published Sat, Mar 5 2016 8:02 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement
Advertisement