చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు సెల్ఫోన్లు వాడిన వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లు వాడిన 12మంది ...
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు సెల్ఫోన్లు వాడిన వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లు వాడిన 12మంది ఖైదీలకు క్షమాభిక్షతో పాటు వారికి ములాఖత్లను కట్ చేశారు. అలాగే 12మంది ఖైదీలో ఆరుగురిని చంచల్గూడ జైలుకు, మరో ఆరుగురిని వరంగల్ జైలుకు తరలించారు. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్కు చిక్కిన వీరాస్వామిని అధికారులు వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు.
చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టారు.