హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదివారం తెల్లవారుజామున అకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైలులోని కృష్ణ, బ్రహ్మపుత్ర బ్యారెక్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ఖైదీల నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖైదీలకు అంతపెద్ద మొత్తంలో గంజాయి ఎలా చేరింది అని జైలు అధికారులను ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సదరు అధికారులను ఆదేశించారు.
కాగా నిన్న జైలు ప్రాంగణలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా జైలు ఆవరణలోని అగరబత్తి తయారీ కేంద్రం వెనక బాగంలో భూమిలోపల కవర్లలో దాచి ఉంచిన సెల్ ఫోన్లను కనుగోన్నారు. వాటిలో ఓ సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... ఆ ఫోన్కు సంబంధించిన కాల్ డేటాను గుర్తించే పనిలో నిమగ్నమైయున్నారు.