Cell Phones Seized
-
ప్రశ్న పత్రం లీక్ యత్నం కేసులో సెల్ఫోన్లు సీజ్
పెడన: కోర్టుల్లో పోస్తుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ చేసేందుకు యత్నించి అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్ జైలుకు పంపించినట్టు కృష్ణాజిల్లా పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.ప్రసన్నవీరయ్యగౌడ్ తెలిపారు. ఇప్పటికే వారి ఫోన్లో ప్రశ్న పత్రానికి సంబంధించిన ఫోటోలను వాటి జిరాక్స్ కాపీలను తీయించడంతో పాటు ఆ ఫోన్లను ఫోరెన్సిక్ (ఎఫ్ఎస్ఎల్)ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. నివేదిక వచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని, రాగానే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించారు. -
ఎయిర్‌పోర్టులో భారీగా సెల్ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సెల్ఫోన్లను పెద్ద సంఖ్యలో పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈ రోజు ఉదయం బ్యాంకాక్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీలో ఈ విలువైన సెల్ఫోన్లు బయటపడ్డాయి. అయితే అవి ఎలాంటి కంపెనీ పేరులేని విలువైన ఫోన్లుగా సమాచారం. దీంతో సదరు మహిళను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చర్లపల్లి జైల్లో భారీగా గంజాయి స్వాధీనం
-
చర్లపల్లి జైల్లో సోదాలు : భారీగా గంజాయి స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదివారం తెల్లవారుజామున అకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైలులోని కృష్ణ, బ్రహ్మపుత్ర బ్యారెక్‌లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ఖైదీల నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖైదీలకు అంతపెద్ద మొత్తంలో గంజాయి ఎలా చేరింది అని జైలు అధికారులను ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సదరు అధికారులను ఆదేశించారు. కాగా నిన్న జైలు ప్రాంగణలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా జైలు ఆవరణలోని అగరబత్తి తయారీ కేంద్రం వెనక బాగంలో భూమిలోపల కవర్లలో దాచి ఉంచిన సెల్ ఫోన్లను కనుగోన్నారు. వాటిలో ఓ సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... ఆ ఫోన్‌కు సంబంధించిన కాల్ డేటాను గుర్తించే పనిలో నిమగ్నమైయున్నారు.