శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం భారీగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సెల్‌ఫోన్లను పెద్ద సంఖ్యలో పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈ రోజు ఉదయం బ్యాంకాక్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికురాలి లగేజీలో ఈ విలువైన సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. అయితే అవి ఎలాంటి కంపెనీ పేరులేని విలువైన ఫోన్లుగా సమాచారం. దీంతో సదరు మహిళను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.