warangal jail
-
చరిత్రగా మిగిలిపోనున్న వరంగల్ జైలు
వరంగల్ సెంట్రల్ జైలు... ఇది మొత్తం భారతదేశంలోనే అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన కారాగారం. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మిం చిన ఈ కారాగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రస్తుతం మనం దేశంలోనే అత్యంత పటిష్టమైనదిగా చెప్పుకుంటున్న తీహార్ జైలు నుండి కూడా ఎన్నోసార్లు ఖైదీలు తప్పించుకొని వెళ్లారు. కానీ 135 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వరంగల్ జైలు నుండి ఇప్పటివరకూ ఒక్క ఖైదీ కూడా తప్పించుకొని పోలే దంటే, ఈ జైలు నిర్మాణం ఏవిధంగా ఉందో ఊహిం చొచ్చు. ఈ జైలులో నేసిన తివాచీలు ప్రపంచ ప్రఖ్యా తిని గాంచాయి. నక్సలైట్ అగ్రనేతలైన∙కానూ సన్యాల్‌తోపాటు కాళోజి, దాశరథి, వీవీ, ప్రస్తుత మావోయిస్టు అగ్రనేత గణపతి లాంటి ఎందరో ఈ జైలు జీవితం గడపిన వారే. కాకతీయ సామ్రాజ్యంగా ఓరుగల్లుకు ఎంత చరిత్ర ఉందో, జైళ్ల రంగంలో దేశంలోనే వరంగల్ కేంద్ర కారాగారానికి అంత పేరుంది. భారత్‌ను సందర్శించడానికి వచ్చిన అనేక మంది విదేశీ చరిత్ర కారులు తమ గ్రంథాల్లో ఈ కారాగారం గురించి రాయడం విశేషం. 19వ శతాబ్దం అంతం వరకు జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేది. నేరస్తులు, నేరా రోపణ ఎదుర్కొంటున్న వారిని గోదాముల లాంటి గదుల్లో ధించేవారు. సరైన మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు ఉండేవి కావు. అయితే 1880లో నిజాం ప్రభుత్వంలో హన్కిన్ అనే అధికారి జైళ్ల శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిజాం రాష్ట్రంలో జైళ్ల నిర్వహణలో గణనీయమైన మార్పులొ చ్చాయి. అందులో భాగంగానే, 1885లో వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం జరిగింది. 15 ఏళ్ల క్రితం వరకు నాటి కట్టడ ప్రతిరూపంగా ఉన్న జైలు ముఖ ద్వారం స్థానంలో కొత్త ప్రవేశ ద్వార నిర్మాణం జరి గినా లోపల మాత్రం గత నిర్మాణాలు యధాతథంగా కన్పిస్తాయి. నాటి నుండి నేటి వరకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థతో పాటు పరిశుభ్రత, ఖైదీల్లో పరి వర్తనకు మారుపేరుగా నిలిచిందీ కారాగారం. జైళ్లను ఉత్తమ ప్రమాణాలు కలిగిన పరివర్తనాలయాలుగా మార్చినందుకు హన్కిన్స్‌కు నిజాం ప్రభుత్వం 1913లో ప్రత్యేక పురస్కారం అందచేసింది. వరంగల్ జైలు కమ్యూనిస్టు తీవ్రవాదులను ఉంచే ప్రధాన కారాగారంగా పేరొందింది. అయితే, ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, 2010 వరకు మావోయిస్టు, జనశక్తి పార్టీ వాళ్లకు ప్రత్యేక బ్యారక్‌లను కేటాయిం చేవారట. వారి కిచెన్లను వారే నిర్వహిం చుకునే వారట. ఖైదీలు కోర్టుకు వెళ్లకుండా ఇక్కడి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపే సౌక ర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ జైలులో ఐ.ఎస్.ఐ. లాంటి వాటికి చెందిన కరుడు గట్టిన ఉగ్ర వాద ఖైదీలను ఉంచుతున్నారు. 13 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సెంట్రల్ జైలులో 700 మంది ఖైదీలను ఉంచడానికి అవకాశ ముండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కృష్ణా జిల్లాల అండర్ ట్రయల్స్, నేరస్థులను కూడా ఇక్కడ ఉంచేవారు. విచారణ ఎదుర్కొనే అండర్ ట్రయల్స్‌కు ఇక్కడ ప్రత్యేక లాకప్ ఉండడం దానికి ఒక కారణం. ఈ జైలు నిర్వహణ అంతా ఇక్కడి సూపరింటెండెంట్ నేతృత్వంలో జరుగుతుంది. ఖైదీలకు వైద్య సదుపా యాలు అందించడానికి ప్రత్యేక డిస్పెన్సరీ, విద్యావ కాశాలకుగానూ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ శిక్ష అనుభవిస్తూనే అనేక మంది ఖైదీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేశారు. దీనిలో బాస్కెట్‌బాల్, వాలీబాల్ తదితర క్రీడా సౌక ర్యాలున్నాయి. గతంలో ఈ జైలులోని ఖైదీలు, అండర్ ట్రయల్స్ రాసే రచనలు, కవితలు, కథలతో సుధార్ అనే ఇంటర్నల్ మ్యాగజైన్ కూడా వెలువరించేవారు. పలు వ్యాధులతో బాధపడే ఖైదీలను ఐసోలేషన్‌లో ఉంచడానికి ప్రత్యేక గదులున్నాయి. 1942లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం పిలుపునివ్వడంతో అందులో పాల్గొన్నందుకుగానూ కాళోజి, ఎం.ఎస్. రాజలింగం, కోమండూరి నారా యణరావు ఈ జైలుకు వెళ్లారు. 1948 జనవరి 11వ తేదీన రజాకార్లు జైలులోకి ప్రవేశించడానికి దాడి చేశారు. అయితే, నిజాయితీపరుడైన జైలు సూపరిం టెండెంట్ రజాకార్లను గేటు వద్దనే అడ్డుకున్నాడు. ఇదే రోజు సత్యాగ్రహాలు చేసిన వారిని నిర్బంధించిన గుల్బర్గా, నిజామాబాద్ జైళ్ల మీదా కూడా రజాకార్లు దాడి చేశారు. ఇందులో నిజామాబాద్ జైలులో దాశ ర«థి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వార్‌స్వామితో పాటు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ నేసిన ఊలు కార్పెట్లు, దుప్పట్లు, బట్టలు, తయారుచేసిన సబ్బులు, ఫర్నీచర్, ప్రింటింగ్ తదితర ఉత్పత్తులను ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తారు. వీటి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖైదీల సంక్షేమం కోసం వినియోగిస్తారు. ఈ జైలు పరిధిలో ఉన్న 15 ఎకరాల వ్యవసాయ భూమిలో కూర గాయలు, మొక్కజొన్న, మామిడి చెట్లతో పాటుగా అనేక పూల మొక్కలను నేటికీ పెంచుతున్నారు. ఈ జైలు ఖైదీల ద్వారా పెట్రోల్ పంపులను కూడా నిర్వ హిస్తున్నారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన వరంగల్ సెంట్రల్ జైలు ఇకనుండి చరిత్రగానే మిగిలిపోనుంది. ఇప్పటికే 75 శాతం ఖైదీలను ఇతర జిల్లాల్లో జైళ్లకు తరలించారు. మరి కొద్దిరోజుల్లో ఈ జైలు నేలమట్టం కానుంది. దీన్ని ధర్మసాగర్ సమీపంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ జైలు స్థలంలో అత్యాధు నిక ప్రమాణాలతో చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మించ డంపై వరంగల్ వాసులు సంతృప్తి చెందుతున్నారు. వ్యాసకర్త పూర్వ డీపీఆర్వో, వరంగల్ మొబైల్ : 98499 05900 -
మర్రిబావిలో మరో రెండు మృతదేహాలు?
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్‌రెడ్డి.. తన మర్రి బావిలో మరో రెండు మృతదేహాలను పూడ్చిపెట్టాడనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి తనతో పాటు లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే దంపతులను హతమార్చి మర్రిబావిలోనే పూడ్చిపెట్టాడని గ్రామంలో చర్చించుకుంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పోలీస్ కస్టడీ నల్లగొండ లీగల్: ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌రెడ్డిని 3 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నల్లగొండ అదనపు జిల్లా జడ్జి ఎస్‌వీవీఎన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని గతనెలలో వారంపాటు పోలీసు కస్టడీకి ఇచ్చిన కోర్టు.. మరో రెండు కేసుల విచారణ నిమిత్తం మూడు రోజులు కస్టడీకి అనుమతించింది. -
కరుడుగట్టిన నిందితుల బ్యారక్‌కు శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు మైనర్లను పొట్టనబెట్టుకున్న శ్రీనివాస్‌రెడ్డిని ఇప్పుడు కరుడుగట్టిన నిందితులకోసం కేటాయించిన బ్యారక్‌లోని ప్రత్యేక సెల్లో పటిష్ట బందోబస్తు మధ్య వరంగల్ జైల్లో ఉన్నాడు. అతని నేరచరిత్ర ఆధారంగా సాధారణ ఖైదీలతో కలవనీయకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు వరంగల్ కారాగార సూపరింటెండెంట్ మురళి బాబు శుక్రవారం తెలిపారు. శ్రీనివాసరెడ్డిని జైలుకు తీసుకువచ్చినపుడు అతనితో జైలు అధికారులు మాట్లాడారు. అడ్మిషన్ రిజిస్టర్లో పేరు నమోదు చేసుకునేటపుడు అతని వివరాలు అడిగినపుడు అతని ప్రవర్తన సాధారణంగా లేదని, అలాగని అసాధారణంగానూ లేదని మధ్యస్థంగా ఉందని జైలు అధికారులు తెలిపారు. ఇలాంటి మనస్తత్వంగల నేరస్తులు ఎప్పుడు ఏం చేస్తారో? ఎలా ప్రవర్తిస్తారో? చెప్పడం కష్టమనీ, ఇలాంటివారు ఇతరులపై లేదా జైలు సిబ్బందిపై దాడులు కూడా చేయవచ్చునని అందుకే, అతన్ని సాధారణ ఖైదీలతో కలవనీయకుండా ప్రత్యేక సెల్ కేటాయించామని అధికారులు వివరించారు. అతని ప్రవర్తనను గమనించేందుకు సెల్లో సీసీ టీవీ కెమెరాలనూ ఉంచామన్నారు. మామూలు ఖైదీలకైతే 200 నుంచి 300 మంది ఖైదీలకు కాపలాగా ఒక జవాన్ ఉంటాడు. కానీ, శ్రీనివాస్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా ఒక జవాన్‌ను కాపలాకు కేటాయించినట్లు అధికారులు వివరించారు. అతనికి ప్రతిరోజూ దినపత్రిక, రెండుపూటల భోజనం అందిస్తున్నామన్నారు. అతనికి అందించే దినపత్రికలో అతనికి చెందిన వార్తలను కత్తిరించి ఇస్తున్నామన్నారు. వేములవాడ, ఆదిలాబాద్, సిరిసిల్లలో పోలీసులు హాజీపూర్ కేసులో సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మర్రి శ్రీనివాసరెడ్డి గతంలో పనిచేసిన ఆదిలాబాద్, సిరిసిల్ల, వేములవాడలో సిట్‌పోలీసులు అతని గురించి ఆరా తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరి వద్ద పనిచేశాడు? ఎంతమంది స్నేహితులు ఉన్నారు. వేములవాడలో అతనితో చనువుగా మెలిగిన మహిళ ఎవరు? ఆమెను మాత్రం చంపకుండా ఎందుకు వదిలేశాడు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఫేస్బుక్ మిత్రుల పైనా.. శ్రీనివాస్‌రెడ్డి మహిళలకు రకరకాలుగా వలవేసి ఉచ్చులోకి లాగేవాడు. ఇందుకోసం ఫేస్‌బుక్‌ను కూడా వాడుకున్నాడు. 600మందికిపైగా ఉన్న అతని స్నేహితుల జాబితాల్లో కేవలం 50 మంది మాత్రమే పురుషులు, మిగిలిన వారంతా మహిళలే కావడం గమనార్హం. వీరిలో ఎవరెవ రితో చాటింగ్ చేశాడు. ఎలాంటి సంభాషణలు చేశాడు. వీడియోకాల్స్, మెస్సేజెస్ తదితర వివరా లను సేకరిస్తున్నారు. నిందితుడి మానసిక, నేరప్రవర్తనకు ఇవి నిదర్శనాలుగా నిలవనున్నాయి. ఫ్రెండ్స్‌లిస్టులో ఉన్నవారితో ఏమైనా సంబంధాలు నెరిపాడా? వారిలో ఎవరినైనా అంతమొందించాడా? అన్నది కూడా కేసు విచారిస్తోన్న ప్రత్యేక బృందం (సిట్) పరిశీలిస్తోంది. -
వరంగల్ జైలుకు శ్రీనివాస్‌రెడ్డి
భువనగిరిఅర్బన్/వరంగల్: హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి భువనగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బొమ్మలరామారం పోలీసులు బుధవారం శ్రీనివాస్‌రెడ్డిని భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు. ప్రథమ శ్రేణి జూనియర్ సివిల్ జడ్జి టి.నాగరాణి ముందు హాజరుపర్చారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్ జైలుకుతరలించారు. వరుస హత్యలకు పాల్పడిన మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై హత్య, అత్యాచారం, సాక్ష్యాల గల్లంతు నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించే ముందు కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్‌రెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం సాయంత్రం తమకు అప్పగించినట్లు వరంగల్ జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. -
బిహార్‌లో వరంగల్ ఖైదీ పట్టివేత
హైదరాబాద్: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుపోయిన ఖైదీ బిహార్‌లో పట్టుబడ్డాడు. బిహార్‌లోని జహానాబాద్ జిల్లాకు చెందిన రాజేష్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతడిని మూడు నెలల క్రితం చర్లపల్లి జైలు నుంచి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే, నవంబర్ 11వ తేదీన రాజేష్‌యాదవ్, సాయింక్ సింగ్ అనే మరో ఖైదీతో కలిసి బెడ్‌షీట్స్‌ను తాడుగా చేసుకుని జైలు గోడదూకి పారిపోయారు. అప్పటి నుంచి రాజేష్ పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బిహార్‌లో ఉన్న అతడ్ని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆ ఖైదీలకు క్షమాభిక్ష, ములాఖత్‌లు కట్
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు సెల్ఫోన్లు వాడిన వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లు వాడిన 12మంది ఖైదీలకు క్షమాభిక్షతో పాటు వారికి ములాఖత్‌లను కట్ చేశారు. అలాగే 12మంది ఖైదీలో ఆరుగురిని చంచల్‌గూడ జైలుకు, మరో ఆరుగురిని వరంగల్ జైలుకు తరలించారు. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు చిక్కిన వీరాస్వామిని అధికారులు వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టారు.