veeraswamy
-
పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్ దర్శకుడు
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ డైరెక్టర్ వీరస్వామి తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ సినిమా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వీరస్వామి డైరెక్ట్ చేసి నిర్మించిన సినిమా ఏప్రిల్ 28 ఏం జరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించారు. సినిమా దర్శకుడు వీర స్వామి చదవండి: ట్రోలింగ్: నీకు 60 ఏళ్లా? వ్యాక్సిన్ తీసుకున్నావ్.. 100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’ -
ఆ ఇద్దరి కాంబినేషన్లో చిత్రం
తమిళసినిమా: విశాల్, టి.రాజేందర్ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా న్యూస్. వీరాస్వామి చిత్రం తరువాత టి.రాజేందర్ ఒరు తలైకాదల్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఇటీవల విజయ్‌సేతుపతితో కలిసి నటించిన కవన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలాంటి వాటిలో విశాల్‌తో కలిసి నటించనున్న చిత్రం ఒకటి. ఈ చిత్రానికి పేరరసు దర్శకత్వం వహించనున్నారు. పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. టి.రాజేంద్రన్ కథ, కథనం, మాటలు, పాటలు. సంగీతం, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో నూతన జంట హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. కథానాయకుడు మలేషియాకు చెందిన నటుడట. కాగా ఇందులో టి.రాజేందర్ ఒక ముఖ్య భూమికను పోషిస్తూ తన శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీని చిత్రీకరణనుæ పూర్తిగా మలేషియాలో నిర్వహించనున్నారట. -
న్యూడెమోక్రసి దళ సభ్యుని లొంగుబాటు
ఇల్లందు: న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ సభ్యుడు జూడి వీరాస్వామి పోలీసులకు లొంగిపోయాడు. ఖమ్మం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం లొంగిపోయాడు. 24 తూటాలు, రెండు తుపాకులను పోలీసులకు అప్పగించాడు. -
ఇంటి దీపం ఆరింది.. కష్టమే మిగిలింది!
ఎక్కడ చావుకేక వినిపించినా.. రోదనలు మాత్రం పాలమూరువే. ఎక్కడ ఏ ఘోరం జరిగినా ఉలిక్కిపాటుకు గురయ్యేది ఇక్కడివారే..! పొట్టకూటి కోసం వెళ్లినవారు ఎక్కడో ఓ చోట చనిపోతున్నారు. లేదంటే తమ పిల్లలను కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఊపిరాడక ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. మ్యాన్‌హోల్ శుభ్రం చేసేందుకు వెళ్లి వీరస్వామి, కోటయ్య మృతి ఆపన్నహస్తం కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపు రెక్కాడితే డొక్కాడని బతుకులు వారివి. ఎవుసం చేద్దామంటే సెంటు భూమి లేదు. ఊరిలో ఉపాధి లేక.. బతుకుదారి చూపేవారు లేక పొట్టచేతపట్టుకుని పట్నం పోయిన ఆ కుటుంబాలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయాయి. ఈనెల 1వ తేదీన హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో వెళ్లిన వలసకూలీలు చాకలికోటయ్య, వీరస్వామి చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఏ దిక్కూలేక వారి భార్యాపిల్లలు రోడ్డునపడ్డారు. నాగర్‌కర్నూల్ మండలం ఉయ్యలవాడ గ్రామానికి చెందిన కోటయ్య(35) గ్రామంలో సెంటు భూమి కూడా లేదు. తన భార్య మంగమ్మతోపాటు ఇద్దరు కూతుళ్లు, కొడుకును తీసుకొని ఆరేళ్లక్రితం హైదరాబాద్‌కు వలసవెళ్లారు. అక్కడే రాంకోటి ప్రాంతంలో ఉన్న ఆర్కే ఎస్టేట్ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు కల్పనను 9వ తరగతి, అఖిల 6వ తరగతి, వంశీ 6వ తరగతి చదివిస్తున్నాడు. భార్య ఇళ్లల్లో పనులకు వెళ్తూ, తానూ అప్పుడప్పుడు అడ్డాకూలీగా పనులకు వెళ్లేవాడు. ఈక్రమంలో మే డే రోజున మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో పనికి వెళ్లాడు. మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువుకు గురై చనిపోయాడు. ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడింది. తన కూతుళ్లను కస్తూర్బా స్కూల్లో, కొడుకును ఏదైనా రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించాలని మంగమ్మ వేడుకుంటోంది. వీరస్వామి కుటుంబం కన్నీటిగాథ మరో వలసకూలీది అదే కన్నీటి వ్యథ.. పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన బోయ బొందయ్య, బాలకిష్టమ్మ పెద్దకొడుకు వీరస్వామి(33) బతుకుదెరువు కోసం 20ఏళ్ల క్రితం హైదారాబాద్‌కు వలసవెళ్లాడు. ప్రస్తుతం రాంకోటి ప్రాంతంలో చిన్నపాటి గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. భార్య భాగ్యలక్ష్మితో కలిసి అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వెళ్లిన వీరస్వామి విషవాయులతో ఊపిరాడక చనిపోయాడు. అతడికి ఇద్దరు కొడుకులు లాలు, శివ ఉన్నారు. వీరస్వామికి గ్రామంలో సొంతిళ్లు కూడా లేదు. కేవలం బేస్మెంట్ వరకే నిర్మించి వదిలివేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ సుల్తానమ్మ, ఎంపీటీసీలు ఎల్లమ్మ, మాధవి కోరారు. వీరస్వామి అంత్యక్రియలు సోమవారం రాత్రి స్వగ్రామంలోనే నిర్వహించారు. -
ఆ ఖైదీలకు క్షమాభిక్ష, ములాఖత్‌లు కట్
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు సెల్ఫోన్లు వాడిన వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లు వాడిన 12మంది ఖైదీలకు క్షమాభిక్షతో పాటు వారికి ములాఖత్‌లను కట్ చేశారు. అలాగే 12మంది ఖైదీలో ఆరుగురిని చంచల్‌గూడ జైలుకు, మరో ఆరుగురిని వరంగల్ జైలుకు తరలించారు. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు చిక్కిన వీరాస్వామిని అధికారులు వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టారు.