పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్‌ దర్శకుడు | Director Veera Swamy Complain To Cyber Police Over Movie On YouTube | Sakshi
Sakshi News home page

సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్‌ దర్శకుడు

Published Sat, Mar 6 2021 8:01 PM | Last Updated on Sat, Mar 6 2021 9:34 PM

Director Veera Swamy Complain To Cyber Police Over Movie On YouTube - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ డైరెక్టర్‌ వీరస్వామి తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏప్రిల్‌ 28 ఏం జరిగింది’ సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వీరస్వామి డైరెక్ట్‌ చేసి నిర్మించిన సినిమా ఏప్రిల్‌ 28 ఏం జరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల, చమ్మక్‌ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించారు.


సినిమా దర్శకుడు వీర స్వామి

చదవండి: 

ట్రోలింగ్‌: నీకు 60 ఏళ్లా? వ్యాక్సిన్‌ తీసుకున్నావ్‌..

100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ఉప్పెన’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement