ఆ ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం | Vishal and T. Rajender are getting ready to work together | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం

Published Thu, Jun 22 2017 3:53 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం

తమిళసినిమా: విశాల్, టి.రాజేందర్‌ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా న్యూస్‌. వీరాస్వామి చిత్రం తరువాత టి.రాజేందర్‌ ఒరు తలైకాదల్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఇటీవల విజయ్‌సేతుపతితో కలిసి నటించిన కవన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలాంటి వాటిలో విశాల్‌తో కలిసి నటించనున్న చిత్రం ఒకటి.


ఈ చిత్రానికి పేరరసు దర్శకత్వం వహించనున్నారు. పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. టి.రాజేంద్రన్‌ కథ, కథనం, మాటలు, పాటలు. సంగీతం, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో నూతన జంట హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. కథానాయకుడు మలేషియాకు చెందిన నటుడట. కాగా ఇందులో టి.రాజేందర్‌ ఒక ముఖ్య భూమికను పోషిస్తూ తన శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీని చిత్రీకరణనుæ పూర్తిగా మలేషియాలో నిర్వహించనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement