బాధితులకు సెల్‌ఫోన్లు అందిస్తున్న ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డి
కొత్తచెరువు: చోరీకి గురైన రూ.10 లక్షలు విలువ చేసే 69 సెల్‌ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. శుక్రవారం ఎస్పీ మాధవరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు వాటిని అందజేయగా వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సెల్‌ఫోన్ చోరీ కేసులకు సంబంధించి 231 సెల్‌ఫోన్లు రికవరీ చేసి వాటిని ఫిర్యాదుదారులకు అందించామన్నారు. సెల్‌ఫోన్‌లు పొగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 6305800426 నంబర్‌కు మైబెల్ వివరాలు వాట్సాప్ చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందే సమాచారం చేరవేస్తారన్నారు. కార్యక్రమంలో ‘దిశ’ డీఎస్పీ వరప్రసాద్, సీఐ మన్సూరుద్దీన్, క్యాట్ టీం ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment