‘బిగ్‌బాస్‌ హౌజ్‌కు మేం వెళ్లట్లేదు’ | Gurmeet Choudhary Denies Bigg Boss Rumuors | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 3 2018 8:49 PM | Last Updated on Fri, Aug 3 2018 8:49 PM

Gurmeet Choudhary Denies Bigg Boss Rumuors - Sakshi

రియాల్టీ షో బిగ్‌బాస్‌ 12వ సీజన్‌కు బాలీవుడ్‌లో రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బుల్లితెర నటుడు గుర్మీత్‌ చౌదరి, ఆయన భార్య దెబినా బెనర్జీ(నటి) ఇద్దరూ ఈ సీజన్‌లో సందడి చేయబోతున్నారంటూ కన్ఫర్మ్‌ చేస్తూ వార్తలు వైరల్‌ అయ్యాయి . ఈ నేపథ్యంలో గుర్మీత్‌ స్పందించాడు. 

‘ఆ వార్తలో నిజం లేదు. ప్రస్తుతం పల్టాన్‌ చిత్రంలో నేను బిజీగా ఉన్నా. తర్వాతి ప్రాజెక్టు కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ దశలో నేను బిగ్‌బాస్‌లో ఎలా పాల్గొంటా? అని గుర్మీత్‌ పేర్కొన్నారు. గుర్మీత్‌ వైఫ్‌ దెబినా కూడా అది ఫేక్‌ న్యూస్‌ అని తేల్చేశారు. మరోవైపు స్వరగిణి ఫేమ్‌ నటి హెల్లీ షా కూడా తాను బిగ్‌బాస్‌లో పాల్గొనట్లేదని ప్రకటించారు. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ సీజన్లు రసవత్తరంగా సాగుతుండగా.. ఈసారి మరింత మసాలాను దట్టించాలని నిర్వాహకులు ఫ్లాన్‌ గీసుకుంటున్నారు.   

పల్టాన్‌... 1967లో సిక్కిం, నాథులా పాస్‌ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు చైనా యత్నించగా.. భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ కాన్సెప్ట్‌తోనే జేపీ దత్తా డైరెక్షన్‌లో పల్టాన్‌ తెరకెక్కింది. జాకీష్రాఫ్, సోనూసూద్, అర్జున్ రాంపాల్,  సిద్ధార్థ్ కపూర్, గుర్మిత్ చౌధురి, హర్షవర్ధన్ రాణె, మోనికా గిల్, ఇషా గుప్తా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్‌ 7న చిత్రం పల్టాన్‌ విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement